మాడిసన్ స్క్రేర్‌లా: చైనాలో భారతీయులనుద్దేశించి మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ: న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రసంగం సంచలనం సృష్టించింది. ప్రపంచ దృష్టిని అది ఆకర్షించింది. ఇప్పుడు అదేవిధంగా చైనాలోను భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

ఈసారి చైనా వాణిజ్య నగరం షాంఘైను ఆయన ఎంచుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన తొలిసారి వచ్చే నెల చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనాలో స్థిరపడిన దాదాపు 45 వేలమంది భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.

PM Modi will try to repeat his Madison Square Garden magic in China

లోగడ ఏ ప్రధానీ చైనా పర్యటనలో ప్రవాసులనుద్దేశించి ప్రసంగించింది లేదు. దీంతో మోడీ పర్యటనను భారత దౌత్యవేత్తలు ప్రతిష్ఠాత్మకంగా భావించి, అత్యంత చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన తేదీలు ఖరారు కాకపోయినా, మే రెండో లేదా మూడోవారంలో ఉండవచ్చునని తెలుస్తోంది.

చైనాలోని వివిధ భారతీయ అసోసియేషన్లు తమ సభ్యులకు ఆయా తేదీలకల్లా షాంఘై చేరుకోవాలని ఆహ్వానపత్రాలు పంపాయి. ఈ ప్రసంగం అనంతరం చైనాలో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొదటి ప్రధాని మోడీ అవుతారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్వరాష్ట్రమైన షాన్సీని కూడా మోడీ సందర్శిస్తారు. టెర్రాకొట్టా వార్రియర్స్‌ నగరంలో మోడీకి జిన్‌పింగ్‌ మంచి విందు ఇస్తారు. ఇక ప్రధాని వచ్చేవారం మూడు దేశాల(ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా)పర్యటనలో భాగంగా కెనడాలోని టొరంటో నగరంలో కూడా ఇలాంటి భారీ సమావేశంలో ప్రసంగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+