రెండేళ్లు: బరాక్ ఒబామాను దాటేసిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈదఫా ఐదు దేశాలు తిరిగి వచ్చారు. ఎక్కువ దేశాలు సందర్శించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను దాటేశారు. పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే మోడీ మొత్తం 35 దేశాలు చుట్టేశారు.

మూడింట రెండు వంతులమంది దేశాధినేతలతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు. తద్వారా భారత్‌తో ప్రపంచ సంబంధాలు మెరుగయ్యేలా చర్యలు చేపట్టారు. పదవి చేపట్టిన తొలి రెండేళ్లలో జనవరి 2009 నుంచి 2011 మధ్యలో బరాక్ ఒబామా 25 దేశాలను మాత్రమే సందర్శించారు.

ఒబామా 1,56,336 కిలో మీటర్లు విమానయానం చేస్తే ప్రధాని మోడీ 2014 మే నుంచి 2016 మే వరకూ 1, 64, 187 కిలోమీటర్లు విమాన ప్రయాణం చేశారు. ఇద్దరు నేతలూ జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, చైనా, దక్షిణ కొరియా, రష్యా, బ్రిటన్, టర్కీ, సింగపూర్, ఆఫ్ఘనిస్థాన్, సౌదీ అరేబియా దేశాలను సందర్శించారు.

PM Narendra Modi's tour covers five nations in 140 hours

ప్రధాని మోడీ సందర్శించిన 35 దేశాల్లో 21 దేశాలు ఆసియాలోనివే కావడం గమనార్హం. ఏడు యూరప్‌లోవి. ఉత్తర అమెరికా, ఆఫ్రికాలో రెండేసి చొప్పున మోదీ పర్యటించారు. మోడీ అమెరికాను మూడుసార్లు సందర్శించారు. తద్వారా అమెరికా అధినాయకత్వంతో పటిష్టమైన సంబంధాలు ఏర్పరిచారు.

ఫ్రాన్స్, రష్యా, సింగపూర్, నేపాల్‌లో మోదీ రెండు సార్లు పర్యటించారు. విదేశాల్లో పర్యటిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రధాని మోడీ చేస్తున్న పర్యటనలకు అనూహ్య స్పందన వస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం ఆయన్ను ఎన్నారై ప్రధాని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని బీజేపీ తప్పుబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+