భారత్ పై పాక్ బిగ్ ఎటాక్..! స్వాతంత్ర్య దినోత్సవం రోజున కీలక నిర్ణయం
ఆగస్టు 14.. పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న ఆర్మీ వ్యూహాత్మక ఫోర్సెస్ కమాండ్ కు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కచ్చితత్వంతో కూడిన రాకెట్ వ్యవస్థలపై ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ దృష్టి సారిస్తుందని తెలిపారు. ఫతే సిరీస్ లోని గైడెడ్ మల్టిపుల్ లాంఛ్ రాకెట్ సిస్టమ్ ను ఉపయోగిస్తుందన్నారు.
🚨BREAKING: PM Shehbaz unveils Army Rocket Force on 78th Independence, calls for unity through Misaq-i-Istehkam-e-Pakistan.https://t.co/G06oqk3DMW pic.twitter.com/FySPtVex58
— The Daily CPEC (@TheDailyCPEC) August 14, 2025
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాకెట్ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు. కచ్చితత్వంతో కూడిన రాకెట్ వ్యవస్థలపై ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ దృష్టి సారిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 13న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ క్షిపణుల విధ్వంసాన్ని చవి చూసిన పాకిస్థాన్ ఈ మేరకు ఆర్మీ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని భావించిన ట్లు తెలుస్తోంది.
ఇక గత కొన్ని రోజులుగా భారత్ పై పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సింధూ నది నుంచి తమకు రావాల్సిన నీటిని ఒక్క చుక్కను కూడా భారత్ కు వదులుకోం అని తెలిపారు. తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే యుద్ధానికి సంకేతంగా తాము భావిస్తామని పేర్కొన్నారు. భారత్ తమకు దక్కాల్సిన నీటిని నిలిపి వేస్తుందని మండిపడ్డారు.

అలాగే అంతకుముందు అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాల్గొని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు నీరు రాకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూసి పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఇక ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు సింధూ జలాల పంపిణీని రద్దు చేసింది.












Click it and Unblock the Notifications