సంచలనం: ఎన్‌కౌంటర్ వీడియో రిలీజ్, 16బుల్లెట్లతో శరీరమంతా తూట్లు!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఓ జమైకన్ యువకుడిని ఎన్‌కౌంటర్ చేసిన వీడియో బయటకురావడం సంచలనం రేపుతోంది. న్యూయార్క్ సిటీ పోలీస్ గురువారం నాడు ఈ వీడియోను విడుదల చేశారు. మారణాయుధాలు కలిగి ఉన్న యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అతను లొంగిపోకపోవడంతో ఎన్ కౌంటర్ చేశారు.

న్యూయార్క్ మీడియా కథనం ప్రకారం.. మిగుఎల్ రిచర్డ్స్(31) బ్రాంక్స్ పట్టణంలోని ఎడెన్వాల్డ్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్నాడు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. వింతగా ప్రవర్తిస్తున్న అతనిపై అనుమానం కలిగి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముగ్గురు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Police Release Body Camera Footage of Shooting Death in Bronx

పోలీసులు వచ్చేసరికి చేతిలో కత్తి, గన్‌లతో రిచర్డ్స్ సైగలు చేయడం మొదలుపెట్టాడు. తుపాకీ కింద పడేయాలంటూ పోలీసులు పలుమార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. 44సార్లు అతన్ని పోలీసులు అతన్ని లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినా.. అతను మాత్రం అలాగే నిలుచుండిపోయాడు. దీంతో అతనిపై కాల్పులు జరపగా.. అక్కడికక్కడే మృతి చెందాడు.

  Arya Vysya leaders demand arrest of Kancha Ilaiahఅరెస్ట్ చేయాలని ఆర్యవైశ్య డిమాండ్ | Oneindia Telugu

  ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తాజాగా న్యూయార్క్ పోలీస్ విభాగం వీడియో విడుదల చేసింది. మరోవైపు మృతుడి తండ్రి మాత్రం తన కొడుకును పోలీసులు కావాలనే హత్య చేశారని ఆరోపించాడు. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి స్నేహితుడు ఎన్‌కౌంటర్‌ అనంతరం దీనిపై స్పందించాడు.

  'పోలీసులు నా స్నేహితుడిని ఆయుధాలు పడేయాల్సిందిగా చాలాసార్లు కోరారు. నేను కూడా లొంగిపోవాలని బతిమాలాను. కానీ అతను వినిపించుకోలేదు. 16బుల్లెట్లు అతని శరీరంలోకి చొచ్చుకుపోయాయి.' అని అతను తెలిపాడు.

  కాగా, వరుస కాల్పుల ఘటనల నేపథ్యంలో పోలీసులపై జాతి వివక్ష ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి న్యూయార్క్ పోలీసులకు బాడీ కెమెరాలను ధరించడం తప్పనిసరి చేశారు. దీంతో తాజా ఎన్‌కౌంటర్‌ దృశ్యాలు కూడా స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The New York Police Department, which has lagged behind many big-city departments in adopting body cameras, released footage on Thursday from the first fatal shooting involving New York City police officers who were wearing the devices.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X