అధ్యక్షుడిగా వేతనానికి నో: లక్ష డాలర్లను విరాళంగా ఇచ్చిన ట్రంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమెరికా: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. 2017 సంవత్సరం నాలుగో త్రైమాసిక వేతనం లక్ష డాలర్లను అమెరికా రవాణా విభాగానికి ఇచ్చారు.

దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించేందుకు ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ రవాణా విభాగం కార్యదర్శి ఎలైన్‌ చావోకు చెక్కును పంపించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

President Trump donates fourth-quarter salary to infrastructure projects

ఇటీవల ట్రంప్ రోడ్లు, వంతెనలు, పోర్టులను పునఃనిర్మించాలని ప్రణాళికలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రవాణా విభాగం అభివృద్ధి కోసం దీనిని సహాయంగా అందించారు. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు కోసం ట్రంప్‌ అందజేసిన డబ్బు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.

వధువు కాదు.. 'మిలియన్ డాలర్ బ్రైడ్' బొమ్మ: ఖరీదు పది లక్షల డాలర్లు

గతంలో కూడా ట్రంప్‌ తన జీతాన్ని ఆరోగ్యం, మానవ సేవలు, జాతీయ పార్క్ సేవలు, విద్యా రంగాలకు ఇచ్చారు. అధ్యక్షుడిగా తాను జీతం తీసుకోకుండా పని చేస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అక్కడ అధ్యక్షుడి జీతం ఏడాదికి నాలుగు లక్షల డాలర్లు. అయితే నిబంధనల ప్రకారం అధ్యక్షుడు కచ్చితంగా వేతనం తీసుకోవాల్సిందే. అందుకని ట్రంప్‌ తన జీతం డబ్బును విరాళంగా ఇస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Department of Transportation just joined the list of agencies to receive a salary donation from President Trump.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి