వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్స్ హ్యారీ-మేఘన్ దంపతులకు పండంటి ఆడబిడ్డ: పేరెంటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/లండన్: బ్రిటన్ రాచరిక హోదాను స్వచ్ఛందంగా వదులుకున్న డ్యూక్ అండ్ డచ్చెస్ ఆప్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులకు పండంటి ఆడ బిడ్డ జన్మించారు. జూన్ 4న అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా బర్బరా కాటేజ్ ఆస్పత్రిలో మేఘన్ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Recommended Video

Indian Princess Gouramma - The Forgotten Princess of Coorg with Similarities To Meghan Markle

కాగా, తమ కుటుంబంలోకి వచ్చిన కొత్త శిశువుకు ఎలిబెత్ 'లిలి' డయానా మౌంట్ బ్యాటెన్-విండ్సర్‌గా నామకరణం చేశారు. ప్రసవం సమయంలో ప్రిన్స్ హ్యారీ ఆస్పత్రిలోనే ఉన్నారు.

ప్రస్తుత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం లిలిబెత్.. హ్యారీ తల్లి డయానా గౌరవార్థం డయానా.. ను శిశువు పేరులో చేర్చారు. ఎలిజబెత్ రాణిని రాజ కుటుంబీకులు ముద్దుగా లిలిబెత్ అని పిలుచుకుంటారు.

 Prince Harry, Meghan Name New Baby Daughter After Queen, Princess Diana

కాగా, ప్రిన్స్ హ్యారీ- మేఘన్ దంపతులకు ఆర్చీ అనే కుమారుడు ఉన్నాడు. అతను 2019లో జన్మించారు. రాజ కుటుంబంలో యూకేకు వెలుపల పుట్టన తొలి వ్యక్తి లిల్లియే కావడం విశేషం. రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ దంపతులు తెగదెంపులు చేసుకున్న తర్వాత వీరు అమెరికాలో నివాసం ఉంటున్నారు.

కొంతకాలం ప్రేమించుకున్న ప్రిన్స్ హ్యారీ-మేఘన్‌లు ఇటీవల వరకు రాజకుటుంబంతోనే ఉన్నారు. అయితే, అక్కడ మేఘన్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజకుటుంబంలో, రాజభవనంలో నివాసం ఉండటం వల్ల తనకు స్వేచ్ఛ లేదని అనిపించిందని మేఘన్ ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Meghan, Britain's Duchess of Sussex, has given birth to her second child, a baby girl, whom she and husband Prince Harry have named after Queen Elizabeth and his late mother Princess Diana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X