విమానం కూలి బిన్ లాడ్ బంధువుల మృతి
లండన్: విమానం కుప్పకూలిపోవడంతో నలుగురు సజీవదహనం అయిన సంఘటన సౌత్ ఇంగ్లాండ్ లో జరిగింది. మరణించిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు పైలెట్ ఉన్నారని బ్రిటీష్, సౌదీ మీడియా వెల్లడించింది. అయితే మృతి చెందిన వారి పూర్తి వివరాలు బయటకు రావలసి ఉంది.
సౌదీకి చెందిన ఓ ప్రయివేటు విమానం శుక్రవారం కూలిపోయిందని బ్రిటన్ లోని హాంప్ పైర్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానం ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు. లాడెన్ సవతి తల్లి, చెల్లి, మరొకరు అందులో ఉన్నారని సమాచారం.
Very sad people died please remember that and im not interested in selling rights its not right please no more offers pic.twitter.com/7UafZDqNdH
— Tubman Thomas (@tubman89) July 31, 2015 ఈ ప్రమాదంలో ఎవ్వరూ బ్రతికే అవకాశం లేదని, ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నామని హాంప్ పైర్ పోలీసు అధికారులు చెప్పారు. ఇటలీలోని మిలాన్ కు చెందిన ఈ విమానం సౌదీలో రిజిస్టర్ అయ్యిందని, అది వారి సొంత విమానం అని ఎయిర్ పోర్టు అధికారులు అన్నారు.
అమెరికా సైన్యం మట్టుబెట్టిన తీవ్రవాది, ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కు సమీప బంధువులు ముగ్గురు ఈ విమానంలో ప్రయాణించారని బ్రిటీష్, సౌదీ మీడియా వెల్లడించింది. బ్రిటీష్ రాయబారి కార్యాలయం అధికారి ఒకరు ఈ విషయంపై ట్విట్ చేశారు. దురదృష్టవశాత్తు విమానం కుప్పకూలిపోవడంతో పైలెట్ తో పాటు నలుగురు మరణించారని ఆ అధికారి ట్విట్ చేశారు.












Click it and Unblock the Notifications