వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో భారత్ వ్యతిరేక నినాదాలు: భారతీయుల ఆగ్రహం, తేల్చి చెప్పారు

|
Google Oneindia TeluguNews

లండన్: కాశ్మీర్ అంశంపై లండన్‌లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడు, పాకిస్థాన్ సంతతి రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్.. గణతంత్ర రోజైన జనవరి 26న(శుక్రవారం) భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.

అంతేగాక, కాశ్మీర్‌కు స్వాతంత్ర్య ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 'బ్లాక్ డే'గా నిరసన చేపట్టాడు. పలువురు పాకిస్థాన్, ఖలిస్థాన్ మద్దతుదారులను వెంటేసుకుని ర్యాలీ నిర్వహించారు.

 కాశ్మీర్, ఖలిస్థాన్ నినాదాలు

కాశ్మీర్, ఖలిస్థాన్ నినాదాలు

కాశ్మీర్ తోపాటు ఖలిస్థాన్‌లకు స్వాతంత్ర్యం ప్రకటించాలంటూ భారత హైకమిషన్ వద్ద నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులతోపాటు బ్రిటిషర్లు కూడా నజీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయుల ఆగ్రహం

ఉగ్రవాద పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతూ బ్రిటీష్ ప్రభుత్వంలో ఎలా ఉంటావంటూ నజీర్‌ను బ్రిటీషర్లు, భారతీయులు మండిపడ్డారు. ఇరు పక్షాల ఆందోళనలతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

నజీర్ ఉగ్ర ఆరోపణలు.. పాక్ మద్దతు

కాగా, లార్డ్ నజీర్‌పై ఇప్పటికే పలు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అవినీతి కుంభకోణాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ఉగ్రవాదులకు సానుభూతి పరుడు లాంటి అంశాల కారణంగా బ్రిటీష్ లేబర్ పార్టీ ఇప్పటికే నజీర్‌ను సస్పెండ్ చేసింది. కాగా, పాకిస్థాన్ ప్రతినిధులు, అధికారులు నజీర్‌కు మద్దతుగా మాట్లాడుతుండటం గమనార్హం.

తేల్చి చెప్పిన భారతీయుడు

‘నా దేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వాతంత్ర్య కావాలని అతడు అడుగుతున్నాడు. అవును నాకు ఆ రాష్ట్రంలో స్వాతంత్య్రం కావాలి. కానీ, అది భారత్ నుంచి కాదు.. పాకిస్థాన్ నుంచి. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘన వంటి విషయాల్లో స్వాతంత్య్రం కావాలి' అని ఆందోళనలో పాల్గొన్న ఓ భారతీయుడు స్పష్టం చేశారు.

భారత స్ఫూర్తి చాటారంటూ కిరణ్ రిజిజు

కాగా, ఈ సంఘటనలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మన దేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన శాంతి వ్యతిరేకులకు సరైన జవాబు చెప్పారంటూ లండన్ భారతీయులను ప్రశంచారు. మీ దేశ భక్తికి సెల్యూట్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి జమ్మూకాశ్మీర్, నాగాలాండ్ నుంచి రాణ్ ఆఫ్ కచ్, కన్యాకుమారి నుంచి పంజాబ్ వరకు మనమంతా ఒక్కటేనని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. నజీర్ లాంటి శక్తులు భారత స్ఫూర్తిని దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు.

English summary
Members of the Indian diaspora on Friday protested against Pakistani-origin UK politician Lord Nazir Ahmed, who held an anti-India campaign on the occasion of the nation’s 69th Republic Day on January 26, reported PTI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X