పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి..! ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే..!

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెందిన ఉత్తర మాస్కోలోని నోవ్ గరాడ్ ఓబ్లాస్ట్ నివాసంపై ఉక్రెయిన్ ఏకంగా 90కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని సకాలంలో అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చర్యను ఖండించారు.

ఈ నేపథ్యంలో రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన భారత్ ఇవాళ స్పందించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయడానిక, శాంతిని సాధించడానికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తాయన్నారు. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని, వాటిని దెబ్బతీసే చర్యలను నివారించాలని ఇరుపక్షాల్నీ మోడీ కోరారు.

Putin Attack Reports Modi Deeply Concerned Calls for Immediate Peace Talks

అయితే పుతిన్ ఇంటిపై దాడి వార్తల్ని ఉక్రెయిన్ ఖండించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ కథనాలు పూర్తిగా కల్పితమని అభివర్ణించారు. ట్రంప్ టీమ్ తో తమ ఉమ్మడి దౌత్య ప్రయత్నాల విజయాలన్నింటినీ అణగదొక్కడానికి ప్రమాదకరమైన ప్రకటనలను ఉపయోగించవద్దని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అంతర్జాతీయ సమాజాన్ని నిర్మాణాత్మక శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించే లక్ష్యంతో రెచ్చగొట్టే రష్యన్ ప్రకటనలను ఖండించాలని కోరారు. ఉక్రెయిన్ రష్యన్ భూభాగంలోని చట్టబద్ధమైన సైనిక స్థావరాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+