వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు: ఏ సమయానికి ఏం జరగనుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
క్వీన్ ఎలిజబెత్

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 అంతిమ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయి.

మొదట వెస్ట్‌మినిస్టర్ అబేకు రాణిని తీసుకెళ్తారు. ఇక్కడ వేలాది మంది ప్రజల సమక్షంలో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి విండ్సర్ క్యాజిల్‌కు ఆమె పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు. చివరగా సన్నిహితుల సమక్షంలో ఆమెను ఖననం చేస్తారు.

ఇదొక ఉద్వేగపూరితమైన, ఆడంబరమైన వేడుకగా జరుగుతుంది. 60 ఏళ్ల క్రితం చివరిసారిగా విన్‌స్టర్ చర్చిల్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి.

సెప్టెంబర్ 19న జరిగే అంత్యక్రియల షెడ్యూల్‌ను బ్రిటన్ కాలమానం ప్రకారం కింద ఇస్తున్నాం.

ఉదయం 6:30

లండన్‌ నడిబొడ్డున ఉన్న వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో క్వీన్ 'లైయింగ్-ఇన్-స్టేట్' సోమవారం తెల్లవారుజామునే ముగుస్తుంది. మహారాణికి నివాళులు అర్పించేందుకు వేలాది మంది క్యూలలో నిలబడి ఉన్నారు.

సమయం

దీనికి కొద్ది దూరంలో ఉన్న వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులను తెరుస్తారు. 11:00 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే అతిథుల కోసం వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులను ముందుగానే తెరుస్తారు.

క్వీన్ అంత్యక్రియల్లో రాజ కుటుంబంతో కలిసి పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు ఒక్కొక్కరుగా బ్రిటన్‌కు చేరుకుంటున్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

యూరప్‌లోని రాజ కుటుంబాల సభ్యులు కూడా రానున్నారు. వీరిలో చాలామంది రాణి రక్త సంబంధీకులు. బెల్జియం కింగ్ ఫిలిఫ్, క్వీన్ మతిల్డే... స్పెయిన్ కింగ్ ఫెలిపే, క్వీన్ లెటిజియా కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు.

సమయం

బుధవారం మధ్యాహ్నం నుంచి వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లోని క్యాటఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ అబేకు తీసుకెళ్లడం మొదలుపెడతారు. దీంతో అంత్యక్రియల కార్యక్రమం మొదలవుతుంది.

...

రాణి శవపేటికను 142 మంది నావికులు, రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్‌లో వెస్ట్‌మినిస్టర్‌ అబేకు తీసుకెళ్తారు. చివరిసారిగా ఈ క్యారేజ్‌ను 1979లో ప్రిన్స్ ఫిలిప్ అంకుల్ లార్డ్ మౌంట్‌బాటెన్ అంత్యక్రియల్లో ఉపయోగించారు. 1952లో క్వీన్ తండ్రి జార్జ్ 6 అంత్యక్రియల కోసం కూడా దీన్నే వాడారు.

..

గన్ క్యారేజ్ ఊరేగింపును కింగ్ చార్లెస్ 3తో పాటు ఆయన కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ, రాజ కుటుంబ సభ్యులు అనుసరిస్తారు.

స్కాటిష్, ఐరిష్ రెజిమెంట్లకు చెందిన వాయిద్యకారులు ఈ ఊరేగింపు ముందు నడుస్తారు. వీరితో పాటు రాయల్ ఎయిర్‌ఫోర్స్ సభ్యులు, గూర్ఖాలు కూడా ఉంటారు.

రాణి వెళ్లే ఈ మార్గంలో రాయల్ నేవీ, రాయల్ మెరైన్ బృందాలు ఉంటాయి. పార్లమెంట్ స్క్వేర్ వద్ద మిలిటరీ బలగాలు 'గార్డ్ ఆఫ్ ఆనర్‌' అందజేస్తాయి.

సమయం

క్వీన్ అంత్యక్రియలకు 2000 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది.

వెస్ట్‌మినిస్టర్ అబేలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. రాణి అంత్యక్రియల సమయంలో కఠినమైన నియమాలు పాటిస్తారు.

అంత్యక్రియలు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబే, చారిత్రక ప్రదేశం. ఈ చర్చిలోనే బ్రిటన్ రాజు లేదా రాణుల పట్టాభిషేకం జరుగుతుంది. 1953లో క్వీన్ ఎలిజబెత్ 2 కూడా ఇక్కడే పట్టాభిషిక్తులయ్యారు. ఇక్కడే 1947లో ప్రిన్సెస్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల వివాహం జరిగింది.

..

రాణి అంత్యక్రియలను వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ నిర్వహిస్తారు. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ, సంతాప సందేశం ఇస్తారు. ప్రధాని లిజ్ ట్రస్ కూడా సందేశం చదువుతారు.

సమయం

ఈ సేవ ముగింపు సమయంలో కాసేపు 'బగల్ కాల్' (ట్రంపెట్స్‌తో చేసే శబ్ధం) చేస్తారు. 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు.

జాతీయ గీతంతో పాటు విలాప సంగీతాన్ని వాయిస్తారు. ఇక్కడితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

సమయం

దీని తర్వాత వెస్ట్‌మినిస్టర్ అబే నుంచి లండన్ హైడ్‌ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్ వరకు కాలి నడకన రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళ్తారు.

ఈ మార్గం అంతా మిలిటరీ అధికారులు, పోలీసులు ఉంటారు. లండన్ వీధుల గుండా నెమ్మదిగా ఈ ఊరేగింపు కదులుతున్నప్పుడు నిమిషం వ్యవధిలో బిగ్ బెన్ గంటలు మోగుతాయి. హైడ్ పార్క్ నుంచి ప్రతీ నిమిషానికి గన్ సెల్యూట్‌ జరుగుతుంది.

...

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ నేతృత్వంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. వీరు ఏడు బృందాలుగా ఉంటారు. ప్రతీ బృందానికి ఒక బ్యాండ్ ఉంటుంది. యూకే, కామన్వెల్త్ దేశాలకు చెందిన సాయుధ బలగాలు, పోలీసులు, ఎన్‌హెచ్‌ఎస్‌లు కూడా ఇందులో పాల్గొంటారు.

క్వీన్ కన్సొర్ట్ క్యామిలా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్, డచెస్ ఆఫ్ ససెక్స్ కార్లలో ఈ ఊరేగింపును అనుసరిస్తారు.

మధ్యాహ్నం 1:00 గంటలకు వెల్లింగ్టన్ ఆర్చ్ వద్ద రాణి శవపేటికను మరో వాహనంలోకి (న్యూ స్టేట్ హీర్స్) తరలిస్తారు. దీంతో విండ్సర్ క్యాజిల్‌కు రాణి తుది ప్రయాణం మొదలవుతుంది.

..

విండ్సర్ క్యాజిల్ దాదాపు 1000 ఏళ్లుగా 40 మంది చక్రవర్తులకు నివాస గృహంగా ఉంది. క్వీన్ ఎలిజబెత్ 2కు కూడా ఈ కోటతో ప్రత్యేక అనుబంధం ఉంది.

యుద్ధ సమయాల్లో బాంబు దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు టీనేజ్ వయస్సులో ఎలిజబెత్‌ను ఈ కోటకు పంపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రాణి ఈ కోటనే తన శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.

భవనం

మధ్యాహ్నం 3 గంటలకు రాణి ఉన్న వాహనం విండ్సర్ క్యాసిల్ సమీపానికి చేరుకునే అవకాశం ఉంది. తర్వాత విండ్సర్ క్యాసిల్ వరకు కాలినడకన ఊరేగింపు జరుగుతుంది. దారి పొడవునా సాయుధ బలగాలు ఉంటాయి.

తర్వాత కాసేపటికి కింగ్‌తో పాటు రాజ కుటుంబంలోని సీనియర్ సభ్యులంతా ఈ ఊరేగింపులో పాల్గొంటారు.

...

కోటలోని సెబాస్టోపోల్, కర్ఫ్యూ టవర్‌లోని గంటలు ప్రతీ నిమిషానికోసారి మోగుతాయి. కోట ప్రాంగణం నుంచి గన్ సెల్యూట్‌గా కాల్పులు జరుగుతాయి.

సాయంత్రం 4 గంటలు

తర్వాత మరో సేవ కోసం రాణి శవ పేటికను, సెయింట్ జార్జి చర్చిలోని చాపెల్‌లోకి తీసుకెళ్తారు.

రాజ కుటుంబాల వివాహాలు, నామకరణ వేడుకలు, అంత్యక్రియలు ఈ చర్చిలోనే జరుగుతాయి. ఇక్కడే 2018లో డ్యూక్ ప్రిన్స్ హ్యారీ, డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్ మర్కెల్‌ల వివాహం జరిగింది. క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు కూడా ఇదే చర్చిలో జరిగాయి.

..

దాదాపు 800 మంది అతిథులు ఈ చర్చిలో కార్యక్రమానికి హాజరవుతారు. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ ఆశీస్సులతో విండ్సర్ డీన్ డేవిడ్ కానర్ ఈ 'కమిటల్ సర్వీస్'ను నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో రాణి పాలన ముగింపును ప్రతిబింబించేలా ఉండే సంప్రదాయాలు ఉంటాయి.

రాణి శవపేటికపై నుంచి ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, ఆర్బ్, రాజదండాలను తొలిగిస్తారు. రాణి నుంచి చివరగా ఆమె కిరటాన్ని వేరు చేస్తారు.

తర్వాత కింగ్ చార్లెస్, రాణి శవపేటికపై గ్రెనెడియర్ గార్డ్స్‌కు చెందిన పతాకాన్ని ఉంచుతారు.

అదే సమయంలో లార్డ్ చాంబర్లాయిన్, ఎంఐ5 మాజీ చీఫ్ బరోన్ పార్కర్ తన మంత్రదండాన్ని విరిచి రాణి శవపేటికపై పెడతారు. ఇలా మంత్రదండాన్ని విరవడం అంటే రాణికి తన సేవలు ముగిసినట్లు అని చెప్పడానికి సంకేతం.

తర్వాత రాణి శవపేటికను, రాయల్ వాల్ట్‌లోకి దించుతారు. తర్వాత రాజ వాయిద్యకారులు 'గాడ్ సేవ్ ద కింగ్' గీతాన్ని ఆలపిస్తారు. వాయిద్యకారులతో విండ్సర్‌లో ఇలా గీతాన్ని ఆలపించాల్సిందిగా రాణి, కోరినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ చెప్పింది.

సాయంత్రం 4: 45 గంటలు

ఇక్కడితో కమిటల్ సర్వీస్ ముగుస్తుంది. కింగ్‌తో పాటు రాజ కుటుంబ సభ్యులు చాపెల్ నుంచి వెళ్లిపోతారు.

సాయంత్రం 7:30 గంటలు

సాయంత్రం, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సెయింట్ జార్జ్ చాపెల్‌ లోపల ఉన్న కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో తన భర్త, ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన రాణిని ఖననం చేస్తారు.

పాలరాతిపై ఎలిజబెత్ 2 1926-2022 అని రాసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Queen Elizabeth -II:Know the schedule of her highness Queen Elizabeth finale rites
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X