సుదీర్ఘ కాలం పాలించిన 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-II కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపం
లండన్: బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి, ఏడు దశాబ్దాలుగా దేశానికి అగ్రగామిగా నిలిచిన క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం తెలిపింది. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో ముందుగానే కుటుంబసభ్యులంతా స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకున్నారు.

సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II
'గురువారం మధ్యాహ్నం బాల్మోరల్‌లో రాణి శాంతియుతంగా మరణించింది' అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.1922లో జన్మించిన ఎలిజబెత్-2.. ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.

క్వీన్ ఎలిజబెత్ II పెద్ద కుమారుడే కింగ్
క్వీన్ ఎలిజబెత్ గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడవడం, నిలబడటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్నుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బుధవారం సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్ కి వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు. కాగా, 'కింగ్, ది క్వీన్ కన్సార్ట్ గురువారం సాయంత్రం బాల్మోరల్‌లో ఉంటారు. శుక్రవారం లండన్‌కు తిరిగి వస్తారు' అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పెద్ద కుమారుడు చార్లెస్, 73, స్వయంచాలకంగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు రాజు అవుతాడు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌తో సహా 14 ఇతర రంగాలకు అధిపతి అవుతారు.
క్వీన్ ఎలిజబెత్ II మృతికి ప్రధాని మోడీ సంతాపం
'2015, 2018లో నా UK సందర్శనల సమయంలో నేను ఆమె మెజెస్టి క్వీన్ ఎలిజబెత్ IIతో చిరస్మరణీయమైన సమావేశాలను నిర్వహించాను. ఆమె ఆప్యాయత మరియు దయను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒక సమావేశంలో మహాత్మా గాంధీ తన వివాహానికి బహుమతిగా ఇచ్చిన రుమాలును నాకు చూపించారు. నేను ఎల్లప్పుడూ ఆ సంజ్ఞను గౌరవిస్తాను' అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications