న్యూయార్క్ లో తొలి భారత మహిళా జడ్జి
న్యూయార్క్: మహిళ అనుకుంటే ఏమైనా సాధిస్తుందని మరో సారి రుజువు అయ్యింది. అమెరికాలో తొలి భారతీయ మహిళా జడ్జిగా చెన్నైకి చెందిన మహిళ నియమితులయ్యారు. చెన్నైకి చెందిన రాజ రాజేశ్వరి (42) ఈ ఘనత సాధించారు.
16 సంవత్సరాల వయస్సులోనే రాజరాజేశ్వరి అమెరికా వెళ్లారు. అక్కడే న్యాయ శాస్త్రం అభ్యసించారు. తరువాత రిచమండ్ కౌంటి డిస్ట్రిక్ అసిస్టెంట్ అటార్నీగా 16 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మేయర్ బిల్ డే బ్లాసియో న్యూయార్క్ లోని క్రిమినల్ కోర్టు జడ్జిగా రాజ రాజేశ్వరిని నామినేట్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు.

తాను జడ్జిగా ఎంపిక కావడం చాల సంతోషంగా ఉందని రాజ రాజేశ్వరి అంటున్నారు. తనలాంటి మహిళలు అమెరికా వచ్చి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. జడ్జిగా పని చెయ్యడం తన కల అని, అది నేరవేరిందని అంటున్నారు.
భారతదేశం నుండి అమెరికా వచ్చే తనలాంటి వారికి ఇది స్పూర్తిదాయకం అంటున్నారు. న్యాయ శాస్త్రంలోనే కాదు అనేక రంగాలలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. రాజ రాజేశ్వరికి కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. రాజరాజేశ్వరి తల్లి పేరు పద్మా రామనాథన్. ఆమె పేరుతో పద్మాలయా డాన్స్ అకాడమీ ఏర్పాటు చేసి తన బృందంతో కలిసి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications