దక్షిణాఫ్రికా అధ్యక్షుడుకు కరోనా- ఒమిక్రాన్ పరీక్షలు : వ్యాక్సిన్ తీసుకున్నా- ఐసొలేషన్‌లో సిరిల్ రామఫోసా..!!
దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్..ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడికి సోకినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ వేరియంట్ భారత్ లోనూ పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇక, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని సమాచారం. దేశ అధ్యక్షుడికి ఒమైక్రాన్ వేరియెంట్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన తర్వాత చికిత్స పొందుతున్నారని అతని కార్యాలయం తెలిపింది.

కరోనా పాజిటివ్ గా నిర్దారణ
రమాఫోసా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కొవిడ్ పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తున్నా..అధికారికంగా వెల్లడించలేదు. అధ్యక్షుడు కేప్ టౌన్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, దక్షిణాఫ్రికా మిలిటరీ హెల్త్ సర్వీస్ ఆయన చికిత్సను పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. రమాఫోసాకు కొవిడ్ సోకిన నేపథ్యంలో డిప్యూటీ ప్రెసిడెంట్ డేవిడ్ మబుజాకు అన్ని బాధ్యతలను అప్పగించారు. ఆయన ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు.

వ్యాక్సినేషన్ పూర్తయినా వైరస్
అధ్యక్షుడికి రెండు డోసుల టీకాలు తీసుకున్నా ఒమైక్రాన్ బారిన పడ్డారని వైద్యులు చెప్పారు.గత వారం రామఫోసా నాలుగు పశ్చిమ ఆఫ్రికా దేశాలను సందర్శించారు. ఈ పర్యటనలో అధ్యక్షుడి ప్రతినిధి బృందంలోని సభ్యులందరికీ కొవిడ్ పరీక్షలు చేశారు. ప్రతినిధి బృందంలోని కొందరు సభ్యులకు నైజీరియాలో పాజిటివ్ అని తేలడంతో వారు నేరుగా దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చారు. రామఫోసా డిసెంబర్ 8న సెనెగల్ నుంచి తిరిగి వచ్చారు.దక్షిణాఫ్రికాలో రమాఫోసాను కలిసిన వ్యక్తులు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని దక్షిణాఫ్రికా వైద్యులు సూచించారు.

దక్షిణాఫ్రికాలో మొదలై..అధ్యక్షుడికి
అధ్యక్షుడితో పాటు దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలంతా వైరస్‌ను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రామఫోసా కోరారని అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు ఉన్న ఇతర అధికారులంతా ఆయా దేశాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రామఫోసా అనారోగ్యంగా ఉండగా.. ఆదివారం కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. అందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని..దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
Recommended Video

భారత్ లో విస్తరిస్తున్న ఓమిక్రాన్
ఇక, భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. తాజాగా ఏపీలో..చంఢీఘడ్ లో ఒక కేసు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో విదేశాల నుంచి 15 మంది నమూనాలను జియోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. అందులో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు లేవని.. ఒమిక్రాన్ కేసులు లేవని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వారి పైన మరింతగా నిఘా పెంచింది. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. అత్యధికంగా మహారాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు వెలుగు చూసాయి.












Click it and Unblock the Notifications