పాకిస్తాన్ రంగస్థలంపై రామాయణం... అదరహో!
వాల్మీకి రచించిన రామాయణం మహాకావ్యంగా మన దేశంలో గుర్తించబడింది. మన భారతీయ వాంగ్మయం లో రామాయణం ఆదికావ్యం. అటువంటి రామాయణాన్ని మన దేశంలో అందరూ చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే అదే రామాయణం వేరే దేశాలలో అందరితో అద్భుతం అని కొనియాడేలా చేస్తే వినటానికి చాలా గర్వంగా అనిపిస్తుంది.
పాకిస్తాన్ లో రామాయణం నాటక ప్రదర్శన
పవిత్ర రామాయణ మహాకావ్యం మన శత్రుదేశం అయిన పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్ లో ప్రదర్శించారు. రంగస్థలం వేదిక పైన రామాయణ మహాకావ్యం ఆధారంగా వేసిన డ్రామా అందరిని ఆకట్టుకుంది. కరాచీ నగరంలోని కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్లో మౌజీ డ్రామా గ్రూపు ప్రదర్శన ఆద్యంతం అద్భుతంగా తోచింది. రామాయణ మహా కావ్యానికి సంబంధించిన ఈ డ్రామాలు వేసిన కళాకారులు పాకిస్తానీయులు.

ఏఐ సాయంతో రామాయణం డ్రామాకు మెరుగులు
వారు ఈ డ్రామాను అంత అద్భుతంగా వేయడం విశేషం కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు డ్రామా గ్రూప్ చేసినటువంటి ప్రయత్నం ఆ డ్రామా చూసిన ప్రతి ఒక్కరి ప్రశంసలను పొందింది. పాకిస్తాన్ కు చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కాజ్మాకు చిన్నప్పటినుండి నాటక రంగం పైన ఎక్కువ మక్కువ ఉండడంతో వీరిద్దరూ థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు.
పాక్ నాటక రంగంలో మైలురాయిగా రామాయణం
ఇటీవల వీరు మరి కొంతమందితో కలిసి నాటక బృందంగా ఏర్పడ్డారు. మౌజ్ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అప్పటినుంచి డ్రామాలను ప్రదర్శిస్తున్నారు. మొట్టమొదటిసారి గత నవంబర్లో సెకండ్ ఫ్లోర్ పేరుతో ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. అప్పుడు రామాయణ నాటకం మంచి ప్రజాదరణను పొందింది . పాక్ నాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మరింత అందంగా
తొలిసారి వేసిన రామాయణ నాటకం సక్సెస్ కావడంతో దీంతో మరిన్ని హంగులు జోడించిన ఈ బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రామాయణ నాటక రంగాన్ని రంగుల మయంగా మార్చారు .ఆర్ట్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో ప్రస్తుతం మూడు రోజులపాటు దీనిని ప్రదర్శించగా స్థానికులతో సహా పలువురు ప్రముఖులు అదరహో అంటూ కితాబిచ్చారు. పాకిస్తాన్ వంటి చోట మన రామాయణ మహాకావ్యం ప్రత్యేకమైన ఆదరణ పొందడం నిజంగా విశేషం.
రామాయణం వేదిక పైన ప్రాణం పోసుకోవడం ఒక దృశ్య విందు
పాకిస్తాన్ లో రామాయణం డ్రామా ప్రదర్శించడం పైన పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం వేదిక పైన ప్రాణం పోసుకోవడం ఒక దృశ్య విందు అని రామాయణ డ్రామా రూపకర్త యోగేశ్వర్ కరేరా కార్యాలయ తెలిపారు. రామాయణం డ్రామాకు పాకిస్తానీయుల నుంచి మంచి స్పందన వచ్చిందని, పాక్ సమాజం చాలా సహనంతో ఉందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications