పంజ్‌షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్

ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్‌షీర్, అందరాబ్‌లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్ మసూద్.. తాలిబన్ల ముందు కొత్త డిమాండ్ ఉంచారు. పంజ్ షీర్, అందరాబ్ నుంచి యుద్ధ విమానాలను ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. అప్పుడే శాంతి చర్చలు జరుపేందుకు అంగీకరిస్తానని తెలియజేశారు.

శాంతి స్థాపన సాధించడానికి తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ ఆ రెండు ప్రాంతాల్లో మిలిటరీ వెనక్కి రావాలని.. అంతేకాదు దాడులు కూడా చేయొద్దని నొక్కి వక్కానించారు. ప్రాంతీయ అసమానత్వం రూపు మాపేందుకు కృషిచేస్తామని వివరించారు. ఇందుకు తాము సిద్దం అని.. భవిష్యత్‌లో తాలిబన్లు, తాము.. ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షించారు.

గత కొద్దీరోజుల నుంచి పంజ్ షీర్ వద్ద తాలిబన్లు, ఎన్ఆర్‌ఎఫ్ఏ మధ్య యుద్దం జరుగుతుంది. పై చేయి సాధించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కీలక జిల్లాలను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. 1000 మంది మిలిటెంట్లను హతమార్చామని ఎన్ఆర్ ఎఫ్ఏ తెలిపింది. పంజ్ షీర్ ప్రాంతం నుంచి గొడవతోనే ఆప్ఘన్‌లో ప్రభుత్వం కూలిపోయింది. అధ్యక్షుడు ఆస్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయారు.

 Ready for peace talks if Taliban withdraw fighters from Panjshir, Andarab

మరోవైపు తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ అక్కడ మహిళలు కొందరు ధైర్యం చేసి రోడ్డెక్కి తమ హక్కుల కోనం నినదిస్తున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఎంతో వివక్ష ఎదుర్కొన్న అక్కడి మహిళలు ఈసారి మాత్రం తమ హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. తాలిబన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టాన్జాయ్‌లకు కూడా కీలక పదవులు దక్కనున్నాయి.

తాలిబన్ అధినేత బరాదర్ దుర్రానీ పష్తూన్ తెగలో జన్మించాడు. కాందహార్‌లోనే పెరిగాడు. ముల్లా ఒమర్‌తో కలిసి సోవియట్ సేనలపై తిరగబడ్డాడు. అఫ్గానిస్తాన్‌ నుంచి సోవియట్ సేనలు వెళ్లిపోయాక అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. అప్పుడే బరాదర్.. ముల్లా ఒమర్‌తో కలిసి తాలిబన్‌ను స్థాపించాడు. 1996 నుంచి 2001 వరకూ ఆప్ఘన్‌లో సాగిన తాలిబన్ల పాలనలో బరాదర్ కీలక పాత్ర పోషించాడు.

Recommended Video

    Afghanistan తాలిబన్ల పాలన.. Mullah Baradar పై India ఆశలు, పాకిస్తాన్ పై ఒత్తిడి || Oneindia Telugu

    20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తాలిబన్ సంస్థలో కీలక నేతగా ఉన్న స్టాన్జాయ్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గత 20 ఏళ్లలో ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన ప్రభుత్వాల్లో భాగమైన ఏ ఒక్కరినీ తాలిబన్ ప్రభుత్వంలో భాగం కానిచ్చేది లేదని స్టాన్జాయ్ స్పష్టం చేశాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+