వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు తుఫాన్‌తో సిరియా శరణార్ధుల మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

లెబనాన్: సిరియా శరణార్థులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. లెబనాన్ సరిహద్దులో మన్నా వద్ద పెను మంచు తుఫాన్ శరణార్ధులను ప్రమాదంలో పడేసింది.మంచు తుఫాన్‌లో కూరుకుపోయిన 15 మంది శరణార్ధుల మృతదేహలను వెలికితీశారు.

సిరియాను వదిలి లెబనాన్‌లో ప్రవేశించాలంటే సరిహద్దులోని పర్వతాలను దాటాల్సివుంటుంది. సరిహద్దును జాగ్రత్తగా దాటేందుకు శరణార్థుల గ్రూపు ఇద్దరు స్మగ్లర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సిరియా నుంచి బయల్దేరిన శరణార్థులు గ్రూపు లెబనాన్‌ సరిహద్దులోని మన్సా వద్దకు వెళ్లేసరికి పెను మంచు తుపాను ప్రారంభమైంది.. కొందరు మంచు తుపాను ధాటికి గడ్డకట్టుకుపోయి సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో పసిపిల్లలు కూడ ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Refugees found frozen in Lebanon near Syria border

లెబనాన్ పౌర రక్షణ అధికారులు శనివారం మంచులో కూరుకుపోయిన 15 మంది శరణార్థుల మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను ప్రమాదంలో వదిలేసిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 10 లక్షల మంది సిరియన్లు లెబనాన్‌కు వలస వెళ్లారు. 2015లో దేశంలో ప్రవేశించే శరణార్థులపై లెబనాన్‌ ఆంక్షలు విధించింది.

English summary
The bodies of nine Syrian refugees who crossed into Lebanon were found frozen in a mountainous area near the border with Syria, according to the Lebanese army
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X