అమెరికాలో కీలక పరిణామం-యూఎస్ హౌస్ పై మళ్లీ రిపబ్లికన్ల పట్టు- డెమోక్రాట్లకు ఎదురుదెబ్బ
అమెరికాలో రెండేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించి గద్దెనెక్కిన జో బైడెన్ ఆధ్వర్యంలోని డెమోక్రాట్ల సర్కార్ పై మధ్యంతర ఎన్నికల్లో విశ్వాసం కాస్త సడలినట్లు కనిపిస్తోంది. తాజాగా వెలువడిన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్లు పలుచోట్ల విజయంసాధించినా యూఎస్ హౌస్ లో మాత్రం రిపబ్లికన్లు స్వల్ప తేడాతో ఆధిక్యం అందుకున్నారు. దీంతో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇదో గుడ్ న్యూస్ గా చెప్తున్నారు.
యూఎస్ హౌస్ లో రిపబ్లికన్లు మొత్తం 218 సీట్లతో ఆధిక్యం అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపాలు, దేశం మాంద్యంలోకి వెళ్లే అవకాశాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ ఓటర్లు నవంబర్ 8న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు మిశ్రమ తీర్పు ఇచ్చారు. అబార్షన్ హక్కులు , ప్రజాస్వామ్యానికి బెదిరింపులు వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి.

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌లు కూడా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని, శిలాజ ఇంధనాల ఉత్పత్తిని విస్తరింపజేస్తామని, సంపన్నులపై ట్రంప్ కాలం నాటి పన్ను తగ్గింపులను పొడిగిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ ఎజెండాలో ఎక్కువ భాగం డెమొక్రాటిక్-నియంత్రిత సెనేట్ తో లింక్ అయి ఉన్నదే కావడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది.
మరోవైపు యూఎస్ హౌస్ లో రిపబ్లికన్ల ఆధిక్యంతో బైడెన్ మంత్రివర్గం, ఆయన బంధువులు, సాంప్రదాయవాదులు తమకు వ్యతిరేకంగా పక్షపాతంగా ఉన్నారని పేర్కొన్న సిలికాన్ వ్యాలీ వ్యాపారాలపై దర్యాప్తు చేయడానికి సబ్‌పోనా అధికారంతో హౌస్ ఇన్వెస్టిగేటివ్ కమిటీలపై ఈ మెజారిటీ జీవోపీ అధికారాల్ని ఆపార్టీ సొంతం చేసుకోబోతోంది. అలాగే 2024లో అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్లు పోరు ప్రారంభించేందుకు ఈ ఎన్నికల ఫలితాలు కాస్త దోహద పడుతున్నా, అంతిమంగా వారు కోరుకున్న స్ధాయిలో మాత్రం ఫలితాలు రాబట్టుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications