అమెరికా శాంతి చిహ్నాలుగా సత్యార్ధి, మలాలా: అమెరికా సెనేట్ తీర్మానం
వాషింగ్టన్: బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న కైలాశ్ సత్యార్థి, మలాలా యూసుఫ్‌జాయ్‌లకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. వీరిద్దరిని శాంతి చిహ్నాలుగా గుర్తించేందుకు ఆ దేశ సెనేట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి ఇప్పటికే 82 వేల మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని సెనేట్ ఆ తీర్మానంలో పేర్కొంది. 11 ఏళ్ల చిన్న వయసు నుంచే మలాలా బాలికల విద్య కోసం కృషి చేసిందని వివరించారు. సెనేటర్ టామ్ హార్కిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంగళవారం ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో బహుమతి ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications