ఉక్రెయిన్ ప్రతికారం : 4300 మంది రష్యా సైనికులు మృతి.. భారీగా యుద్ధ ట్యాంకులు ద్వంసం !!
రష్యా సేనలు మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను హస్తగతం చేసుకున్నాయి. అయినా వెనుదిరగకుండా ఉక్రెయిన్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. రష్యా సేనల బాంబుల దాటికి అనేక భవనాలు నెలమట్టం అయ్యాయి. ఎంతో మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినా వీరోచితంగా రష్యా బలగాలకు ఉక్రెయిన్ సేనలు దీటుగా సమాధానం చెబుతున్నాయి.

4300 మంది రష్యా సైన్యం మృతి
ఉక్రెయిన్ ప్రతిఘటనలో రష్యా కూడా భారీగానే తన సైన్యాన్ని కోల్పోయింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధభేరిలో ఇప్పటివరకు 4300 మంది రష్యా సైనికులు మృతి చెందారు. ఈమేరకు ఉక్రెయిన్ ఉప రక్షణశాఖ మంత్రి హనా మల్యార్ వెల్లడించారు. అటు 146 యుద్ధ ట్యాంకులు, 26 ఎయిర్ క్రాప్ట్ లు , 26 హెలికాప్టర్లను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. సాధారణ నివాస ప్రాంతాల్లో కూడా రష్యా దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాణభయంతో పొరుగుదేశాలకు పరుగులు
అటు రష్యా బాంబుల దాడులతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిగ్గుబిగ్గుమంటూ బతుకుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొరుగుదేశాలకు పారిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే దాదాపు 3,68,000 మంది ఉక్రెయిన్ పౌరులు పక్క దేశాలకు పారిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉక్రెయిన్ కు అము అన్నివిధాల సాయం చేస్తామని ఆదేశ సరిహద్దు దేశం రొమేనియా ప్రకటించింది. తమ దేశ సరిహద్దుకు చేరిన ఉక్రెయిన్ పౌరులకు సాయం అందిస్తోంది.

రొమేనియా సాయం
అంతే కాకుండా ఉక్రెయిన్ కు దాదాపు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయాన్ని ప్రకటించింది. మిలటరీ సామాగ్రి, బుల్లెట్ ప్రూప్ జాకెట్లు, చమురు, జాకెట్లు , ఆహారం వంటి సామాగ్రిని అందిస్తామని స్పష్టం చేసింది. రష్యా దాడుల్లో గాయపడ్డా సైన్యానికి , పౌరులకు వైద్య సాయం అందిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా రష్యా సైనిక చర్యలపై అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉక్రెయిన్ ఆశ్రయించింది. వారి సైనిక ఆపరేషన్ నిలిపివేసేలా రష్యాను ఆదేశించాలని కోరింది.












Click it and Unblock the Notifications