భారత్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతకి చెందిన వ్యక్తి

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా రాయబారిగా తొలిసారిగా భారత సంతతికి చెందిన అమెరికన్ రిచర్డ్ రాహుల్‌ వర్మ (46) పేరు ఖరారైంది. మంగళవారం అమెరికా సెనెట్ రాహుల్ వర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది.

దీంతో ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ రాయబారిగా రాహుల్ వర్మ రికార్డు సృష్టించారు. రాహుల్ వర్మ ఈ పదవి చేపట్టడం ద్వారా భారత్ - అమెరికా మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతధిగా రానున్న విషయం తెలిసిందే. బరాక్ ఒబామా తన ప్రభుత్వంలో భారత సంతతి చెందిన వ్యక్తులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్న విషయం తెలిసిందే.

Richard Rahul Verma confirmed as US envoy to India

రాహుల్ వర్మ నియామకంతోపాటు ఇతర ముఖ్యమైన విభాగాలకు అధిపతులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఇంతకు ముందు రాహుల్ వర్మ స్టేట్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్ సహాయ కార్యదర్శిగా పనిచేశారు.

ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫస్ట్, ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమాక్రాటిక్ ఇన్స్‌టిట్యూట్ బోర్డుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో భారత రాయబారిగా విధులను నిర్వహించిన నాన్సీ పావెల్‌పై పలు వివాదాలు వెల్లువెత్తడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.

ఆమె రాజీనామా చేసినప్పటీ నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఆ తర్వాత భారత ప్రధానిగా మోడీ బాధ్యతలను చేపట్టారు. దీంతో భారత్‌తో మరింతగా సంబంధాలను బలోపేతం చేసేందుకు గాను రాహుల్ వర్మను భారత రాయబారిగా ఎంపిక చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+