వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు చుక్కలే - ప్రధానిగా ఎన్నికైతే తొలి టార్గెట్ : రిషి సనాక్ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో కీలకంగా మారిన రిషి సనాక్ కొత్త సంచలనానికి తెర లేపారు. రిషి సనాక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని పదవిలో ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. ఆయన రేసులో రెండో స్థానంలో ఉన్నారంటూ తాజాగా సర్వేలు బయటకు వచ్చినా..తాను మాత్రం తగ్గేది లేదంటూ రిషి తేల్చి చెబుతున్నారు. మాజీ ఆర్దిక మంత్రి నుంచి ప్రధానిగా ఎదిగేందుకు రిషి దేశంలోని కీలక సమస్యలను ప్రస్తావిస్తున్నారు.

అందులో భాగంగా..రిషి పై ప్రధాని బరిలో పోటీ పడుతున్న లిజ్‌ ట్రస్‌ ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఇదే సమయంలో తాను ప్రధాని అయితే, చైనాతో తన వైఖరి ఎలా ఉండబోతోందో తేల్చి చెప్పారు.

చైనాకు చుక్కలు చూపిస్తామంటూ

చైనాకు చుక్కలు చూపిస్తామంటూ

చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు. తాజాగా.. యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్‌ సరైన వ్యక్తి అని డ్రాగన్‌ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల కధనం ప్రచురించింది. చైనాతో తన వైఖరి క్లారిటీ ఇస్తూ..అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్‌ పవర్‌ ప్రభావాన్ని అడ్డుకునేందుకు తీసుకొనే చర్యలను వెల్లడించారు.

దీని కోసం బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్‌ పవర్‌ను అడ్డుకుంటామని చెప్పారు. యూకేలోని యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీని బయటకు పంపుతామని స్పష్టం చేసారు.

చైనా సైబర్ దాడులకు ధీటుగా

చైనా సైబర్ దాడులకు ధీటుగా

బ్రిటన్‌ డొమెస్టిక్‌ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగించి చైనా గూఢచర్యాన్ని అడ్డుకుంటామని రిషి చెప్పుకొచ్చారు. నాటో అంతర్జాతీయ సహకారం కోసం ప్రయత్నిస్తామని చెబుతూనే.. చైనా సైబర్ దాడులను అరికట్టే చర్యలు కఠినంగా ఉంటాయని వెల్లడించారు. చైనా తమ టెక్నాలజీని దొంగిలిస్తూ..బ్రిటన్ విశ్వ విద్యాలయాల్లోకి చొరబడోతందని రిషి వ్యాఖ్యానించారు.

రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులను ఆశగా చూపిస్తూ తమ నియంత్రణలోనే ఆ దేశాలు ఉండేలా చేస్తోందంటూ మండిపడ్డారు. చైనా అమలు చేస్తున్ బెల్డ్ అండ్ రోడ్ పథకం పైన రిషి కీలక వ్యాఖ్యాలు చేసారు.

చైనా కుట్రలను తిప్పి కొట్టటమే లక్ష్యంగా

చైనా కుట్రలను తిప్పి కొట్టటమే లక్ష్యంగా

చైనా మానహ హక్కులను కాల రాస్తోందంటూ ఫైర్ అయ్యారు. కరెన్సీని తగ్గించటం ద్వారా అంతర్జాతీయంగా ఆర్దిక రంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రిటన్ తో పాటుగా పశ్చిమ దేశాలు..ఆ దేశాల నేతలు చైనా కు రెడ్ కార్పెట్ పరిచారని చెప్పుకొచ్చారు. చైనా కుటిల బుద్దిని గుర్తించలేకపోయారంటూ వివరించారు.

ఇక, తాను బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన తొలి లక్ష్యం వీటిని మార్చటమేనని రిషి స్పష్టం చేసారు. ఇప్పుడు రిషి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. భారత్ లో రిషి ప్రకటించన అంశాల పైన చర్చ కొనసాగుతోంది.

English summary
Rishi Sunak said that Britain's domestic spy agency MI5 would be used to help combat Chinese espionage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X