రిషి సునాక్​ ముందంజ - బ్రిటన్ పధాని పగ్గాలు దక్కేనా : తొలి రౌండ్ లో ఇలా..!!

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ తొలి రౌండ్ లో ముందంజలో నిలిచారు. ఎన్నికల్లో భాగంగా.. కన్జర్వేటివ్​ పార్టీ తొలి రౌండ్​ ఎన్నికలో రిషి సునాక్ తొలి రౌండ్​ ఎన్నికలో అత్యధిక శాతం ఓట్లు గెలుచుకున్నారు. రెండో రౌండ్ ఎన్నికకు అర్హత సాధించారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్‌, అటార్నీ జనరల్‌ సుయెలా బ్రావెర్మన్‌ చోటుదక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన మరో కీలక నేత, హోం మంత్రి ప్రీతి పటేల్‌ మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ముందే ప్రకటించారు. ప్రధాని పదవికి సునాక్‌, బ్రావెర్మన్‌ సహా మొత్తంగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు.

పాకిస్థాన్‌ సంతతికి చెందిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సాజిద్‌ జావిద్‌, రెహ్మాన్‌ చిస్తీ ప్రధాని పదవికి పోటీ చేయాలని భావించినప్పటికీ.. నామినేషన్‌కు అవసరమైన కనీస మద్దతు (20 మంది ఎంపీల మద్దతు) కూడగట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కితగ్గారు. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, ఆర్థిక శాఖ నూతన మంత్రి నదీమ్‌ జహావా, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్‌, మాజీ మంత్రులు కెమీ బదెనోచ్‌, జెరెమీ హంట్‌, మరో నేత టామ్‌ టుగెంధాట్‌లు చివరి వరకు జాబితాలో నిలిచారు. వారిలో కనీస మద్దతు సాధించని ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. మిగతా ఆరుగురు అభ్యర్థులు రెండో రౌండ్​లో పాల్గొనున్నారు. ఈ నెల 21 నాటికల్లా పోటీలో ఇద్దరు అభ్యర్థులే మిగిలేలా తదుపరి రౌండ్లు నిర్వహిస్తారు.

Rishi Sunak Tops First Round Of Voting In Leadership Contest in UK PM Race

ప్రధాని పదవికి సెప్టెంబరు 5న తుది ఎన్నిక జరగనుంది. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కన్జర్వేటివ్‌ హోం వెబ్‌సైట్‌ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే- సునాక్‌ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. బదెనోచ్‌, సునాక్‌, బ్రావెర్మన్‌ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలుస్తారని విశ్లేషించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ వైఖరికి నిరసనగా మంత్రుల రాజీనామా.. ఆ తరువాత సభ్యుల మద్దతు కోల్పోవటంతో ఆయన తన పదవికి రాజీనామా చేసారు. తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకూ పదవిలో మాత్రం కొనసాగనున్నారు. అందులో భాగంగా మొదలైన ఈ ప్రక్రియలో తొలి రౌండ్ లో రిషి ముందజలో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+