మోదీతో పెట్టుకోవద్దు మొర్రో..!!
Donald Trump For Nobel Peace Prize: అత్యున్నత నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకోనున్నారా? ఈ పురస్కారం దాదాపుగా ఆయనకు ఖాయమైనట్టేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నోబెల్ శాంతి బహుమతికి అడుగు దూరంలో నిలిచారు ట్రంప్. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఆయన పేరును సిఫారసు చేశారు.
అంతా సవ్యంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దీనికి మోకాలడ్డినట్లు తెలుస్తోంది. జూన్ 17న జరిగిన ఫోన్ సంభాషణ ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్నిప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతికి తన నామినేషన్‌కు మద్దతు ఇవ్వాలని ట్రంప్ ప్రధాని మోదీని కోరారు. ఈ విజ్ఞప్తిని ప్రధాని మోదీ తిరస్కరించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఇదే విషయాన్ని తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ప్రస్తావించారు. భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధించాన్ని తప్పుపట్టారు. డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ టారిఫ్ చైనాపై విధించిన వాటి కంటే అత్యంత కఠినమైనవని, మూడు దశాబ్దాల అమెరికా-భారత్ సంబంధాలకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయకపోవడం వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మూడు దశాబ్దాలుగా జరిగిన ద్విపక్ష ప్రయత్నాలను ట్రంప్ ప్రమాదంలో పడేశారని మండిపడ్డారు. మోదీ తనకు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయకపోవడం వల్లే ట్రంప్‌లో ఈ అసహనం పెరిగిందని అన్నారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో రో ఖన్నా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ట్రంప్‌కు ఓటు వేసిన ఏ భారతీయ అమెరికన్లు ఈ విషయంపై మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అమెరికా-భారత్ కాకస్ సహ-అధ్యక్షుడిగా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని నాశనం చేయడానికి ఏమి చేస్తున్నారో ముందుగానే హెచ్చరిస్తోన్నానని పేర్కొన్నారు. బ్రెజిల్ మినహా ఏ ఇతర దేశంపై ఇంతకంటే ఎక్కువ టారిఫ్ లేదని గుర్తు చేశారు.
Trump is destroying 30 years of bipartisan work to build the US-India strategic partnership because Modi refuses to nominate him for a Nobel Peace Prize. He imposed higher tariffs of 50% on India than China.
— Ro Khanna (@RoKhanna) September 2, 2025
Which Indian Americans who voted for Trump are speaking out? https://t.co/KdBYIUWDMo pic.twitter.com/GNG8aiNOH5
ఈ టారిఫ్ వల్ల అమెరికాకు తోలు, టెక్స్ టైల్స్ ఎగుమతులు దెబ్బ తింటోన్నాయని రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది- అమెరికన్ తయారీదారులు, భారత ఎగుమతిదారులను తీవ్రంగా నష్టపరుస్తోందని పేర్కొన్నారు. ఈ టారిఫ్ వల్ల భారత్.. చైనా, రష్యా వైపు మొగ్గు చూపుతోందని అన్నారు. ఈ రెండు దేశాల వైపు భారత్ ను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నెట్టుతున్నారని చెప్పారు. దీనికి కారణం- నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేయడానికి మోదీ నిరాకరించడమేనని రు" అని ఖన్నా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications