ఘోర బస్సు ప్రమాదం: 35 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం ఉదయంఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కాందహార్ నుంచి కాబుల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 35 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications