రోడ్డు పక్కన బాంబు పేలుడు: జిల్లా కలెక్టర్ దుర్మరణం

కందహర్: తీవ్రవాదులు అమర్చిన బాంబులు పేలి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆప్ఘానిస్థాప్ లో జరిగింది. చెర్చినోలో శనివారం జరిగిన ఈ బాంబు పేలుడులో ఆ జిల్లా కలెక్టర్ తో పాటు ఇద్దరు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.

చర్చినో జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ హక్యార్, ఆయన స్నేహితుడు, భద్రతా సిబ్బందితో కలిసి శనివారం తన కార్యాలయానికి బయలుదేరారు. ఆ సమయంలో రోడ్డు పక్కన అమర్చిన బాంబులు పేలిపోయాయి. ఆ బాంబు పేలుడులో జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ తో పాటు ఇద్దరు దుర్మరణం చెందారు.

Roadside bomb kills Afghan district chief

జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ స్నేహితుడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడులో జిల్లా కలెక్టర్ మరణించారని ఉర్వజ్గన్ ప్రావెన్స్ గవర్నర్ మహమ్మద్ నయాబ్ అధికారికంగా దృవీకరించారు.

ఆప్ఘానిస్టాన్ లో జరిగిన ఈ బాంబు పేలుడుకు తామే బాధ్యులు అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని అధికారులు అంటున్నారు. బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందు జాగ్రత చర్యగా పలు చోట్ల సోదాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+