ఉక్రెయిన్‌ చేతిలో రష్యా అవమానకర ఓటమి: ఆ సిటీ నుంచి వెనక్కి మళ్లిన సైన్యం..!!

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధం ఇవ్వాళ్టితో 200 రోజులకు చేరింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. 200 రోజులుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.

ప్రతిఘటన..

ప్రతిఘటన..

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

ఉక్రెయిన్ దూకుడు..

ఉక్రెయిన్ దూకుడు..

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

తూర్పు నుంచి వెనక్కి..

తూర్పు నుంచి వెనక్కి..

ఉక్రెయిన్‌లో కీలకమైన తూర్పు ప్రాంత పట్టణాల నుంచి రష్యన్ సైనిక బలగాలు క్రమంగా వెనక్కి మళ్లుతున్నాయి. ఇక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఖార్కీవ్ ప్రావిన్స్‌లో ప్రధాన నగరమైన ఇజియం నుంచి తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రీయూనిట్ కావడంలో భాగంగా ఇజియం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకున్నట్లు వివరణ ఇచ్చింది.

 2,000 చదరపు అడుగుల భూభాగం..

2,000 చదరపు అడుగుల భూభాగం..

ఈ నెల ఆరంభం నుంచి రష్యా సైనికుల దాడులకు ఉక్రెయిన్ సమర్థవంతంగా ప్రతిదాడులను సాగిస్తోంది. శక్తిమంతమైన వ్యూహాలకు రూపకల్పన చేసింది. 2,000 వేల చదరపు కిలోమీటర్ల మేర తమ ప్రాంత భూ భాగాన్ని రష్యా దళాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా పరాజయం ఖాయమైందని, ఈ ఓటమి నుంచి ఎవరూ ఆ దేశాన్ని కాపాడలేరని అన్నారు.

సైనిక హబ్‌గా..

సైనిక హబ్‌గా..

ఖార్కీవ్ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరం ఇజియాన్ని రష్యా తన సైనిక హబ్‌గా తీర్చిదిద్దుకుంది. అదే చోట ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు రష్యా ప్రకటించింది. దీన్ని తమ విజయంగా ఉక్రెయిన్ ప్రకటించుకోగా.. రీయూనిట్ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు రష్యా పేర్కొంది. రష్యాను తాము ఓడించగలమని, యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాల సహకారంతో ఈ యుద్ధాన్ని గెలవగలమని క్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+