ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర.. కిరాయి గుండాలతో రష్యా ఫ్లాన్
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధపోరు ఆగడం లేదు.. రోజు రోజుకు పరిస్థితి మరింత భయాందోళనకు దారితీస్తోంది. ఉక్రెయిన్ చుట్టూ రష్యా తన సైనిక బలగాలను మోహించి బాంబులతో విరుచుకుపడుతోంది. అటు ఉక్రెయిన్ కూడా రష్యాను సైన్యాన్ని దీటు ఎదుర్కొంటోంది. ఈ సైనిక పోరు ఎక్కడి దారితీస్తోందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు హత్యకు కుట్ర
ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హత్యకు భారీ కుట్ర జరుగుతోందన్న ఓ వార్త ప్రపంప వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు రష్యా కిరాయి గూండాలను కూడా సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ఈ కిరాయి గూండాల బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది . ఈ వాగ్నర్ గ్రూప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

వాగ్నర్ గ్రూప్‌తో ఫ్లాన్
ఈ కిరాయి గూండాల బృందం జనవరిలోనే ఉక్రెయిన్ చేరుకుందని అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో వెలువరించింది. వారిలో 400 మంది బెలారస్ నుంచి కీవ్ వైపు వెళ్లారని పేర్కొంది. వీరంతంగా ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారరని తెలిపింది . ప్రస్తుతం శాంతి చర్చలు ఉన్న నేపథ్యంలో తమ ప్రణాళిక అమలుకు కాస్త విరామం ఇచ్చినట్లు వాగ్నర్ గ్రూప్ సభ్యుడు పేర్కొన్నట్లు రాసుకోచ్చింది

టార్గెట్ 23 మంది
ఈ కిరాయి గూండాల టార్గెట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ప్రధాని, కీవ్ మేయర్ తో సహా మొత్తం 23 మంది ఉన్నారని ఆ వార్తాసంస్థ కథనం వెలువరించింది.. ఈ వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేటు మిలటరీ. పుతిన్ తన వ్యూహాత్మక లక్ష్యాలను నేరవేర్చేందుకు దీనిని ఉపయోగిస్తుంటారని అందరూ నమ్ముతారు. మరోవైపు రష్యా గురి తనపైనే ఉందని .. తమ కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్రపన్నుతోందనిని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలు గుప్పించారు. ఈనేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications