దేవుడా.. అసలే ఉత్తరకొరియాతో చస్తుంటే.. మళ్లీ రష్యా భారీ అణు ప్రయోగం!
రష్యా దేశ చరిత్రలోనే అతి పెద్ద ఖండాంతర అణు క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగానికి సిద్ధమైంది.
మాస్కో: ఇప్పటికే ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఆ మధ్య హైడ్రోజన్ బాంబును పరీక్షించానంటూ హడలగొట్టింది. అమెరికాను సైతం ఢీ అంటే ఢీ అంటోంది.
ఇప్పుడు రష్యా కూడా 'నా దారి.. అణుదారి' అంటోంది. ఐసీబీఎం శాటన్-2 ను చూపిస్తూ 'కబడ్దార్' అంటోంది. ఇక ఈ ప్రపంచాన్ని వినాశనం నుంచి కాపాడగలిగేది ఎవరు?
Recommended Video


సింగిల్ స్ట్రయిక్ తో అమెరికా తుత్తునియలు!
కాస్కో.. చూస్కో అంటోంది మాస్కో. సింగిల్ స్ట్రయిక్ తో అగ్రరాజ్యం అమెరికా రక్షణ వ్యవస్థను సైతం బద్ధలు కొట్టగలనని గప్పాలు కొడుతోంది. ఏకంగా ‘అమెరికా .. మాకొక లెక్కా..' అనే స్థాయికే వచ్చిదంటే ఇక ప్రపంచ దేశాలు రష్యాకొక లెక్కా?

ఒకేసారి డజను న్యూక్లియర్ వార్ హెడ్ లు...
ఇంతకీ విషయం ఏమిటంటే.. రష్యా దేశ చరిత్రలోనే అతి పెద్ద ఖండాంతర అణు క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఐసీబీఎం పేరు ‘శాటన్-2'. ఒకేసారి 40 మెగా టన్నుల బరువు కలిగిన డజను న్యూక్లియర్ వార్ హెడ్ లను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు.

సాంకేతిక లోపాలతో పలుమార్లు వాయిదా...
ఈ శాటన్-2 అమెరికా 1945లో జపాన్ లోని పట్టణాలైన హిరోషిమా, నాగసాకీలపై వేసిన ఆటంబాంబు కంటే కూడా దాదాపు 2 వేల రెట్లు శక్తివంతమైనది. ఇప్పటికే పలు మార్లు శాటన్-2 పరీక్ష వాయిదా పడింది. కారణం.. తరచూ క్షిపణిలో సాంకేతిక లోపాలు తలెత్తడమే.

రష్యా సైన్యంలోకి...
తాజాగా ఈ శాటన్-2 క్షిపణి పరీక్షను ఈ ఏడాది చివర్లో రష్యా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఐసీబీఎం శాటన్-2ను రష్యా సైన్యానికి అందించే ముందే వీలైనన్ని పరీక్షలు నిర్వహించాలని రష్యా యోచిస్తోంది. 2019 కల్లా ఈ ప్రయోగాలను పూర్తి చేసి సర్వీసులోకి తీసుకుంటామని రష్యా అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్ధనైనా ఈ క్షిపణి చేధించగలదని వారు పేర్కొంటున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications