russia-ukrain war : రంగంలోకి జర్మనీ, ఫ్రాన్స్-పుతిన్ తో అధినేతల చర్చలు
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై అసహనంగా ఉన్న యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ.. యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి దిగాయి. ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చర్చలు జరుపుతున్నారు. ఇందులో రష్యాను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తగ్గాలని వారు కోరుతున్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా దాడి 17వ రోజుకు చేరుకోవడంతో, అనేక నగరాలు దాడులతో దద్దరిల్లుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఉక్రెయిన్ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇవాళ తాజాగా చర్చలు జరుపుతున్నారు. రష్యా దళాలు కీవ్‌పై బాంబుల దాడిని తీవ్రతరం చేస్తే యూరోపియన్ యూనియన్ .. మాస్కోపై ఒత్తిడి కొనసాగిస్తుందని మాక్రాన్ వెల్లడించారు.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య దౌత్యం, చర్చలు శత్రుత్వానికి ముగింపు పలకాలని ఐరాసలో భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి "రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష చర్చలు శత్రుత్వాల విరమణకు దారితీస్తాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు తెలిపారు. దౌత్యం, సంభాషణల మార్గం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన తెలిపారు. భయంకరమైన మానవతా పరిస్థితిపై తక్షణ శ్రద్ధ అవసరమన్నారు. కాగా, ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రుల మధ్య గురువారం జరిగిన చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. తమ దేశం ఉక్రెయిన్‌లో పోరాడదని, నాటో, రష్యాల మధ్య ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications