Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russia-Ukraine war: రష్యా సరిహద్దుల్లో చిక్కుక్కున్న 500మంది భారతీయ విద్యార్ధుల అవస్థలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులు అవుతున్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడుతోంది. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. రష్యా సృష్టిస్తున్న బీభత్సం కారణంగా ఉక్రెయిన్ వాసులు చాలామంది వలసల బాట పట్టారు. ఇప్పటికే యాభై లక్షల వరకు ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లుగా సమాచారం.

Recommended Video

    #RussiaUkraineConflict: దిక్కుతోచని స్థితిలో Indian Students సవాల్ గా Operation Ganga | Oneindia

     రష్యాకు సమీపంలో సుమీ పట్టణంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

    రష్యాకు సమీపంలో సుమీ పట్టణంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు


    ఇదిలా ఉంటే వేలాది మంది భారతీయ విద్యార్థులు ఈ యుద్ధ భూమిలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది భారతీయ విద్యార్థులు తూర్పు ఉక్రెయిన్ లోని సుమీ పట్టణంలో చిక్కుకుపోయారు. దాదాపు 500 మంది భారతీయ విద్యార్థులు రష్యన్ సరిహద్దులకు దగ్గరగా చిక్కుకుని రష్యా గుండా తమను స్వదేశానికి తరలించారని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రష్యన్ సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో సుమీ పట్టణం ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు స్వదేశానికి చేరే మార్గం తెలీక దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    సుమీ నుండి పశ్చిమ వైపుకు ప్రయాణం చెయ్యటం కష్టం

    సుమీ నుండి పశ్చిమ వైపుకు ప్రయాణం చెయ్యటం కష్టం

    ఉక్రెయిన్ పశ్చిమ వైపు వెళ్లడానికి వారికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర వాతావరణంలో భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ పశ్చిమ వైపు ప్రయాణం చేయడానికి సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఉక్రెయిన్ పశ్చిమ వైపు ప్రయాణం చేయటం కూడా మంచిది కాదని భావిస్తున్నారు. రష్యా క్షిపణుల దాడులతో ఇప్పటికే అక్కడి వ్యవస్థ అంతా ధ్వంసం అయింది. ల్యాండ్ మైండ్ లతో నిండి ఉన్న రహదారులపై ప్రయాణం ప్రాణాంతకమని భావిస్తున్నారు.

    రష్యా ద్వారా తీసుకురావటానికి సాధ్యపడుతుందా?

    రష్యా ద్వారా తీసుకురావటానికి సాధ్యపడుతుందా?


    రాజధాని కీవ్ వరకూ పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో భయం భయంగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు భారతీయ విద్యార్థులు. మరి రష్యా సమీపంలో ఉన్న భారతీయ విద్యార్థులను రష్యా గుండా తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. తమను కాపాడాలని, ఎలాగైనా స్వదేశానికి తీసుకువెళ్లాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తినటానికి ఆహారం లేక, బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.

    రష్యా యుద్ధ నేరాలపై మార్చి 7, 8 తేదీలలో అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ

    రష్యా యుద్ధ నేరాలపై మార్చి 7, 8 తేదీలలో అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ

    ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్. ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గమని, పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాలని అందరూ కలిసి రావాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రష్యా చేసే దాడులు, యుద్ధ నేరాలపై మార్చి 7, 8 తేదీలలో అంతర్జాతీయ న్యాయస్థానంలో బహిరంగ విచారణ జరగనుంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించడానికి భారత్ ముమ్మర సన్నాహాలు చేసింది.

    కొనసాగుతున్న ఆపరేషన్ గంగా ... ప్రాణ నష్టం జరగకుండా భారత్ ప్రయత్నాలు

    కొనసాగుతున్న ఆపరేషన్ గంగా ... ప్రాణ నష్టం జరగకుండా భారత్ ప్రయత్నాలు


    ఆపరేషన్ గంగా లో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతూ భారతీయులను స్వదేశానికి చేరుస్తుంది. ఇక వచ్చే మూడు రోజుల్లో మొత్తం 26 విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన భారతీయులందరినీ, ఒక్క చోటికి చేర్చి వారిని తీసుకు రావడం భారత్ కు పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు భారతీయ విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందగా, మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భారత్ ప్రయత్నాలు సాగిస్తోంది. భారతీయులను రక్షించే పనిలో ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+