వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాపై దాడి: చూస్తూ ఊరుకోం: రష్యా, ఐనా తగ్గేది లేదన్న అమెరికా

సిరియాపై దాడి నేపథ్యంలో అమెరికాకు.. రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండు దేశాలు తలపడడానికి ఒక్క అడుగే దూరం ఉన్నట్లు పేర్కొంది. ఇరు దేశాల నడుమ ఉన్న హాట్ లైన్ ను కూడా మూసేస్తామని హెచ్చరించింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మాస్కో: అమెరికాకు.. రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సిరియాలోని వైమానిక స్థావరంపై క్షిపణి దాడులకు పాల్పడినందుకు అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరించింది.

మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన యూఎస్‌ఎస్‌ పోర్టర్, యూఎస్‌ఎస్‌ రాస్‌ అనే రెండు యుద్ధనౌకల నుంచి సుదూరంగా ఉన్న సిరియాలోని షైరత్‌ వైమానిక స్థావరం మీద దాదాపు 60 వరకు తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

అమెరికా క్షిపణి దాడుల్లో ధ్వంసమైన వైమానిక స్థావరంలో రష్యాకు చెందిన ప్రత్యేక బలగాలు, హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ మీద సిరియా చేస్తున్న పోరాటానికి అండగానే ఇవి అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.

తొలి నిర్ణయమే వివాదాస్పదం...

తొలి నిర్ణయమే వివాదాస్పదం...

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విదేశాంగ విధానానికి సంబంధించి తీసుకున్న తొలి నిర్ణయమే అమెరికా - రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణభూతమైంది. ఒబామా హయాంలో రష్యాతో తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలను తాను మెరుగు పరుస్తానని ట్రంప్‌ చాలా సందర్భాలలో పేర్కొన్నారు. కానీ తాజా పరిణామం ఇందుకు విఘాతంగా మారింది.

కొన్ని దేశాలే మద్దతు...

కొన్ని దేశాలే మద్దతు...

రెబల్స్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో సిరియా సైన్యం రసాయన దాడులకు పాల్పడి, 70 మంది అమాయకులను మట్టుబెట్టడంతో తాము ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా చెబుతున్నా, అంతర్జాతీయ సమాజం మాత్రం దాన్ని అంతగా ఆమోదించడం లేదు. బ్రిటన్‌ లాంటి ఒకటి రెండు దేశాలు మాత్రం అమెరికాను సమర్థించాయి. మిగిలిన వాళ్లంతా అమెరికా దుందుడుకు చర్యను ఖండించారు.

ఆరేళ్లలో ఇది రెండోసారి...

ఆరేళ్లలో ఇది రెండోసారి...

గత ఆరేళ్లుగా సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఇది రెండోసారి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ఆదేశాలతోనే రసాయన దాడులు జరిగాయని, వాటిలో కనీసం 70 మంది మరణించారని చెబుతుండగా... సిరియా ప్రభుత్వం మాత్రం ఆ దాడులు చేసింది తాము కాదని, తమ దగ్గర రసాయనిక ఆయుధాలే లేవని అంటోంది.

ఫలితాలు తీవ్రంగా ఉంటాయి: వ్లాదిమిర్‌ సాఫ్రన్‌కొవ్‌

ఫలితాలు తీవ్రంగా ఉంటాయి: వ్లాదిమిర్‌ సాఫ్రన్‌కొవ్‌

ఈ రసాయన దాడి అనంతరం అమెరికా చేసిన క్షిపణి దాడులతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రష్యా ఎప్పటినుంచో సిరియాకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అమెరికా అక్రమంగా తీసుకున్న ఈ ఏకపక్ష చర్యలను తాము గట్టిగా ఖండిస్తున్నామని, దీనికి ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ఉప రాయబారి వ్లాదిమిర్‌ సాఫ్రన్‌కొవ్‌ తెలిపారు.

ఇక ఒక్క అడుగే దూరం, హాట్ లైన్ కూడా మూసేస్తాం...

ఇక ఒక్క అడుగే దూరం, హాట్ లైన్ కూడా మూసేస్తాం...

రష్యా సైన్యంతో నేరుగా తలపడేందుకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే అమెరికా ఉందన్న విషయాన్ని ఈ దాడులు నిరూపిస్తున్నాయని రష్యా ప్రధాన మంత్రి డిమిట్రీ మెద్వదెవ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా అనాలోచితంగా చేసిన ఈ దాడి ఫలితంగా రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన హాట్‌లైన్‌ మూతపడుతుందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ కూడా హెచ్చరించింది.

అత్యవసరంగా భద్రతామండలి సమావేశం...

అత్యవసరంగా భద్రతామండలి సమావేశం...

సిరియాపై అమెరికా క్షిపణి దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి అత్యవసరం సమావేశమైంది. ఈ సమావేశంలో అమెరికా త‌న స్వ‌రాన్ని మ‌రింత తీవ్రం చేసింది. క్షిప‌ణి దాడుల‌ను స‌మ‌ర్థించుకున్న అమెరికా, ఇక ముందు కూడా సిరియా అంశంపై మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినున్న‌ట్లు చెప్పింది.

కారణం సిరియా అధ్యక్షుడే: నిక్కీ హేలీ

కారణం సిరియా అధ్యక్షుడే: నిక్కీ హేలీ

అమెరికా త‌ర‌పున ఆ దేశ రాబయారి నిక్కీ హేలీ మాట్లాడుతూ సిరియా అధ్యక్షుడు అసద్ బాషర్ రసాయనిక దాడులు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. నాగరిక దేశాలు అన్నీ కలిసిరావాలని, సిరియా సమస్యకు రాజకీయ పరిష్కారం కల్పించాలని ఆమె సూచించారు. బాషర్ మరోసారి రసాయనిక దాడులు చేయరాదని ఆమె తీవ్ర స్వరంలో అన్నారు. సిరియా రక్తపాతానికి ఇరాన్, రష్యాలే కారణమని కూడా ఆమె ఆరోపించారు.

భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు...

భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు...

అయితే సిరియా విషయంలో అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సమీప భవిష్యత్తులో తాము సిరియా మీద మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవ్‌ నుచిన్‌ తెలిపారు.

చూస్తూ ఊరుకోం... అవసరమైతే మరిన్ని చర్యలు

చూస్తూ ఊరుకోం... అవసరమైతే మరిన్ని చర్యలు

అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా సిరియా విషయంలో ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే రసాయనిక ఆయుధాలు ఉపయోగిస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని, తమ జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా రసాయనిక ఆయుధాల ఉపయోగాన్ని నిరోధించడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తాము మరిన్ని చర్యలు తీసుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Russia warned on Friday that U.S. cruise missile strikes on a Syrian air base could have "extremely serious" consequences, as President Donald Trump's first major foray into a foreign conflict opened up a rift between Moscow and Washington. The warships USS Porter and USS Ross in the Mediterranean Sea launched dozens of Tomahawk missiles at the Shayrat air base, which the Pentagon says was involved in a chemical weapons attack this week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X