
రష్యాలో కూలిన యుద్ద విమానం, ఇద్దరు మృతి
రష్యాలో ఓ యుద్ద విమానం కూలింది. ఇంజిన్‌లో సమస్య తలెత్తి కుప్పకూలింది. రష్యాలో గల అజొవ్ గనరంలో ఈ ఘటన జరిగింది. యుద్ద విమానం 9 అంతస్తుల భవనంలో కూలడంతో.. ఆ బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఫోటో చూస్తే ప్రమాద తీవ్రత అర్థం అవుతుంది.

శిక్షణ కోసం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం పేలిపోయిందని రష్యా రక్షణశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందులో ఉన్న ఇద్దరూ సేఫ్ అని.. నివాస ప్రాంతాల్లోకి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని వివరించింది. ఇంధనం పవల్ల మంటలు వేగంగా వ్యాపించాయి.
ప్రమాదంలో ఇద్దరు జనం చనిపోయారు. 19 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంతో దాదాపు 17 అపార్ట్ మెంట్స్ ప్రభావానికి గురయ్యారు. 100 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.
యుద్ద విమానం కూలిన చోట వైమానిక దళానికి నిలయం.. ప్రమాదం గురించి రష్యా అధ్యక్షుడికి సమాచారం అందజేశారు. మంత్రులు, ఆరోగ్యం గురించి స్థానిక గవర్నర్ సహాయ చర్యలను చేపడుతున్నారు. ఎగసిపడుతున్న అగ్ని కీలలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రమాద వీడియోలను రష్యాకు చెందిన చానెల్స్ ప్రసారం చేశాయి.