బంగాళదుంపలు మనుషుల్ని బలిగొంటాయా? : నివ్వెరపోయే నిజం.. తస్మాత్ జాగ్రత్త!

రష్యా : బంగాళదుంపలు ఏకంగా ఓ కుటుంబ ప్రాణాన్నే బలిగొన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ ఆశ్చర్యం మన అవగాహన రాహిత్యమే అన్న స్పృహ కలగకమానదు ఈ విషాదాన్ని చదివిన తర్వాత. రష్యాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ప్రతీ ఒక్కరిని చలింపజేస్తోంది. ఈ విషాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి అనాథగా మిగిలిపోవడం అందరినీ కలచివేస్తోన్న అంశం.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. బంగాళదుంపలను గాలి చొరబడని చోట నిలువ చేయడమే ఆ కుటుంబం మొత్తాన్ని బలిగొన్నది. ఆ పూటకు బంగాళదుంప వంటకం చేయాలన్న ఉద్దేశ్యంతో.. సెల్లార్‌ గదిలో నిల్వ ఉంచిన బంగాళదుంపలు తీసుకురావడానికి వెళ్లాడు మేరియా తండ్రి. అలా వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన అతని భార్య కూడా సెల్లార్ గదిలోకి వెళ్లింది.

Russian girl, 8, orphaned after her ENTIRE family is wiped out by deadly gas caused by rotting potatoes in the cellar

అంతే.. ఆమె కూడా మళ్లీ తిరిగి రాలేదు. ఆ తర్వాత వాళ్లను అనుసరిస్తూ.. అక్కడేం జరిగుంటుందో పరిశీలిద్దామని సెల్లార్ లోకి వెళ్లిన మేరియా అన్నయ్య, నానమ్మ కూడా మళ్లీ తిరిగి రాలేదు. ఏం జరుగుతుందో అర్థంగాని స్థితిలో చిన్నారి మేరియా కూడా సెల్లార్ వైపు అడుగులు వేసింది. అయితే అప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మేరియా తల్లి.. మేరియా లోపలికి రావడానికి వీలు లేకుండా సెల్లార్ గది తలుపును మూసేసింది. దీంతో మేరియా మాత్రమే మృత్యువు నుంచి తప్పించుకోగలిగింది.

అసలెందుకలా జరిగింది?

కుటుంబ మొత్తాన్ని బలిగొన్న ఈ ఘటనకు కారణం బంగాళ దుంపల నుంచి విడుదలయ్యే గ్లైకోలకాయిడ్స్ అనే విషపూరిత రసాయనమే. బంగాళదుంపలను వెలుతురు చొరబడని గదిలో ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఈ విషపూరిత రసాయనం వాటి నుంచి వెలువడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. బంగాళదుంపలతో పాటు నైట్‌షేడ్ అనే విషపూరిత మొక్క కూడా ఈ రసాయనాన్ని విడుదల చేస్తుందని డాక్టర్లు తెలిపడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+