వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం విడిచిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ?.. హత్యకు రష్యా కుట్రలు..? జెలెన్ స్కీ భద్రతపై ఆందోళన

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో భీకర దాడులు కొనసాగిస్తోంది. ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్య క్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి వెళ్లినట్లు రష్యా మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. ఉక్రెయిన్ దేశాన్ని వీడి పోలాండ్ వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఇలాంటి వార్తలు ఇంతకు ముందుకు కూడా వెలువువడ్డాయి. కానీ ఆవార్తలను జెలెన్ స్కీ కొట్టిపారేశారు. తను కీవ్ లోనే ఉన్నానని తమ కుటుంబం కూడా ఇక్కడే ఉన్నట్లు చెప్పారు. అనేక వీడియోలను కూడా పోస్ట్ చేశారు.

ఉక్రెయిన్ వీడి పోలాండ్ వెళ్లిన జెలెన్ స్కీ?

ఉక్రెయిన్ వీడి పోలాండ్ వెళ్లిన జెలెన్ స్కీ?

ఈ నేపథ్యంలో రష్యా మీడియా వార్తల్లో నిజమెంతో తేలియాల్సి ఉంది. కాగా తనను అంతం చేసేందుకు రష్యా కుట్రలు చేస్తోందని ఇప్పటికే అనేక సార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు. అటు అంతర్జాతీయ మీడియాలో కూడా జెలెన్ స్కీని అంతమొందించేందుకు తీవ్రప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు ప్రసారం చేశాయి. ఆయన్న హత్య చేసేందుకు ఇప్పటికే వందల మంది ప్రైవేటు సైన్యం కీవ్ లోకి ప్రవేశించాయన్న వార్తలు వెలువడ్డాయి.

 హ‌త్య‌కు మూడు సార్లు ప్ర‌యత్నాలు?

హ‌త్య‌కు మూడు సార్లు ప్ర‌యత్నాలు?

ఉక్రెయిన్‌పై యుద్దం మొదలైనప్పటి నుంచి జెలెన్ స్కీని హతమార్చేందుకు మూడు సార్లు ప్రయత్నాలు జరిగినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఉక్రెయిన్ దళాలు అప్రమత్తం వలన వారి కుట్రలను భగ్నం చేసినట్లు పేర్కొన్నాయి. రష్యా మద్దతున్న వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించాయని లండన్‌కు చెందిన ఓ అంతర్జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. మరోవైపు చెచెన్ ప్రత్యేక దళాలు కూడా జెలెన్ స్కీని చంపేందుకు ప్రయత్నించినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

 ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌న్న అమెరికా..

ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌న్న అమెరికా..


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భద్రతా విషయంలో ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ విడిచి రావాలని కోరుతున్నాయి. తాము రక్షణ కల్పిస్తామని ఆగ్రరాజ్యాలు సైతం ఆహ్వానించాయి. అయినా వారి ఆహ్వానాలకు జెలెన్ స్కీ తిరస్కరించారు. తమ దేశ యుద్ధభూమిలోని పూర్తి స్థాయి సైనికుడిగా మారారు. తన దేశం కోసం రష్యాతో చివరి వరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. తమ దేశ పౌరులను కూడా యుద్ధంరంగంలోకి దిగేలా చేశారు. రష్యా దాడులను శక్తి వంచన లేకుండా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Russian media claims Ukriane president zelensky left Ukraine to poland
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X