ఢిల్లీలో సీఐఏ ఛీఫ్, రష్యా ఎన్ఎస్ఏ ? అంతా సీక్రెట్- ఆప్ఘన్ అజెండాపై చర్చలు-ఏం జరుగుతోంది ?
ఆప్ఘనిస్తాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికార పగ్గాలు హస్తగతం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. ఇదే క్రమంలో ఆప్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు భారత్ ఆహ్వానం మేరకు అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారుల బృంధాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఇవాళ రష్యా జాతీయ భద్రతా సలహాదారు మన భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు ప్రధాని మోడీతోనూ సమావేశం కాబోతున్నారు. అదే క్రమంలో సీఐఏ ఛీఫ్ కూడా ప్రధానిని కలవబోతున్నట్లు తెలుస్తోంది.

తాలిబన్ల సర్కార్ ప్రకటన
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల సర్కార్ ప్రకటన వచ్చేసింది. ప్రధానమంత్రిగా ముల్లా హసన్ వ్యవహరించబోతుండగా.. అతని డిప్యూటీగా ముల్లా బరాదర్ కు ఛాన్స్ దక్కింది. ఇక అమెరికా మోస్ట్ వాంటెండ్ గా ఉన్న హక్కానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీ సహా మొత్తం 33 మందితో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది. దీంతో ఆప్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై భారత్ లో ఆందోళన పెరుగుతోంది. ఇదే క్రమంలో ప్రపంచ

ఢిల్లీలో రష్యా ఎన్ఎస్ఏ, సీఐఏ ఛీఫ్
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దాని స్ధానంలో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు సహజంగానే భారత్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారిపై తాలిబన్ల కాల్పులు, పంజ్ షీర్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న విధానం భారత్ తాజా ఆందోళనకు కారణం. పైకి ఎన్నిమాటలు చెప్పినా తాలిబన్లు భారత్ వ్యతిరేక వైఖరితోనే ఉంటారని భావిస్తున్న నేపథ్యంలో భారత్ తమ మిత్రదేశాలైన అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారుల్ని చర్చలకు ఆహ్వానించింది. దీంతో రష్యా జాతీయ భద్రతా సలహాదారుతో పాటు అమెరికా సీఐఏ ఛీఫ్ విలియం బర్న్స్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

సీఐఏ ఛీఫ్ తో అజిత్ ధోవల్ చర్చలు ?
ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చించేందుకు భారత్ చేరుకున్న అమెరికా సీఐఏ ఛీఫ్ విలియం బర్న్స్ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నిన్న సమావేశమయ్యారు. విలియం బర్న్స్ తో పాటు వచ్చిన అమెరికా ఇంటిలిజెన్స్ టీమ్ తో ధోవల్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఆప్ఘనిస్తాన్ నుంచి తరలింపులు, తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుపై ధోవల్ చర్చించారు. ఆప్ఘనిస్తాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తలెత్తిన పరిస్ధితులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు.

నేడు రష్యా ఎన్ఎస్ఏతో ప్రధాని భేటీ
ఇవాళ ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రష్యా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ నికోలాయ్ పత్రుషేవ్ తో సమావేశం కాబోతున్నారు. తాలిబన్లతో భారత్ సంబంధాలు మెరుగుపర్చుకోవాలని గతంలో పుతినా్ ప్రధాని మోడీకి సూచించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ రష్యా కీలక అధికారుల బృందంతో జరిగే భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో విదేశాంగమంత్రి జై శంకర్ కూడా పాల్గొనే అవకాశముంది. తాలిబన్లతో రష్యా సత్సంబంధాల నేపథ్యంలో ప్రధాని మోడీ భేటీ కీలకంగా మారింది.

రష్యా, చైనా, యూఎస్ కీలక పాత్ర
ప్రస్తుతం అమెరికా నుంచి ఆఫ్గన్ బలగాలు వైదొలిగాయి. రష్యా నేరుగా తాలిబన్ల సర్కారులో జోక్యం చేసుకోవడం లేదు. గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నప్పుడు తాలిబన్లు, అక్కడి నేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే రష్యా తాలిబన్ల సర్కార్ కు మద్దతిస్తోంది. అయితే ఏ విధంగా చూసినా అంతర్జాతీయ స్ధాయిలో అప్ఘనిస్తాన్ భవిష్యత్ పరిణామాల్ని నిర్ణయించే స్ధాయిలో అమెరికా, రష్యా ఉన్నాయని భారత్ నమ్ముతోంది. మరోవైపు ఆప్ఘనిస్తాన్ పరిణామాల్లో అమెరికా జోక్యాన్ని తప్పుబడుతున్న రష్యా, భారత్ విషయంలో మాత్రం సానుకూల దృక్పథంతో ఉంది. తాలిబన్లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తేనే మంచిదని రష్యా సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్-రష్యా-చైనా కలిసి అమెరికా లేని ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని ప్రతిపాదిస్తోంది. దీంతో రష్యా పాత్ర ఇక్కడ కీలకంగా మారిపోయింది.
Recommended Video

ఆప్ఘన్ అజెండా ఖరారయ్యేది ఇక్కడే
ఆప్ఘనిస్తాన్ లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ ఏర్పాటయ్యే తాలిబన్ల సర్కార్ తో ఎలా వ్యవహరించాలన్న దానిపై భారత్ కీలక నిర్ణయం తీసుకునే ముందు అక్కడ పరిణామాల్లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాల్ని సంప్రదించాలని భావిస్తోంది. అందుకే త్వరలో జరిగే స్కో (sco), క్వాడ్ (quad) ఆవిర్భావ కార్యక్రమానికి వెళ్లనున్న మోడీ అక్కడే ఆప్ఘన్ పరిణామాలపై అమెరికా, రష్యా ప్రభుత్వాధినేతలతో చర్చించే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడే ఆప్ఘన్ లో అగ్రదేశాల భవిష్యత్ వ్యూహం ఖరారు కానుంది. సెప్టెంబర్ 16న జరిగే స్కో మీటింగ్ లో వర్చువల్ గా పాల్గొనబోతున్న ప్రధాని మోడీ.. 24న జరిగే క్వాడ్ మీటింగ్ కు మాత్రం అమెరికా వెళ్లనున్నారు. రేపు బ్రిక్స్ సమావేశంలోనూ వర్చువల్ గా మోడీ హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్ పింగ్ కూడా హాజరుకాబోతున్నారు. ఆయా సమావేశాల్లో ఆఫ్ఘన్ పరిణామాలపై ప్రధాని మోడీ చర్చించబోతున్నారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications