మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్: పోప్
వాటికన్ సిటి: నోబుల్ బహుమతి గ్రహీత మదర్ థెరిస్సా కు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ ప్రకటించనున్నారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సాను సెయింట్ గా ప్రకటించడానికి పోప్ ప్రాన్సిస్ సుముఖత వ్యక్తం చేశారు.
అనాథలు, వృద్దులకు అంధించిన అపురూపమైన సేవలతో ప్రపంచ శాంతి దూతగా పేరొందిన మదర్ థెరిస్సా ఇప్పుడు దైవదూతగా అవతరించనున్నారు. మదర్ థెరిస్సా శక్తులు అద్బుతమని పోప్ ఫ్రావిన్స్ కోనియాడారు.
ఇదే విషయాన్ని శుక్రవారం ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింది. బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న సమయంలో మదర్ థెరిస్సా తన అద్బుతమైన శక్తులతో దీవించి అతని ప్రాణాలు కాపాడారని పోప్ పేర్కొన్నారు.

అందువలనే తాము మదర్ థెరిస్సాకు దైవశక్తి ఉన్నట్లు అంగీకరించామని పోప్ తెలిపారు. 2016 సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్ గా ప్రకటించనున్నారు.
వాటికన్ సిటీ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. క్రైస్తవ మిషనరీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మదర్ థెరిస్సా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ సిటీ నుంచి మిషనరీ ఆఫ్ చారిటీ స్థాపనకు అనుమతి తీసుకు వచ్చారని మమతా బెనర్జీ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications