హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పెషల్ శాటిలైట్, ఆ 11వెపన్స్.. ఇవాంకా వెంట 'మార్వెల్‌', కనీవిని ఎరుగని సెక్యూరిటీ ఇది..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

హైదరాబాద్: ఇవాంకా రాకవేళ హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన సంగతి తెలిసిందే. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత.. చీమ చిటుక్కుమన్నా గుర్తించగలిగేలా నిఘా.. ఆఖరికి ఆహార పదార్థాలకు కావాల్సిన దినుసులు కూడా అమెరికా నుంచే తెప్పిస్తుండటం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాంకా రాకవేళ అన్నీ విస్తుగొలిపే విషయాలే.

ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఆమె భద్రతను పర్యవేక్షిస్తోంది. భారతీయ భద్రతా సిబ్బంది కూడా వెపన్స్ తో హెచ్ఐసీసీ సదస్సుకు రావద్దని ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ నుంచి ఆదేశాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ప్రత్యేక శాటిలైట్:

ప్రత్యేక శాటిలైట్:

అమెరికా రూపొందించిన ప్రత్యేక శాటిలైట్ ద్వారా ఇవాంకా భద్రతను పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ లో అడుగు పెట్టింది మొదలు తిరిగి అమెరికా చేరేవరకు అడుగడుగునా దీని నిఘా కొనసాగుతుంది. శాటిలైట్ ద్వారా వచ్చే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

సీక్రెట్ సర్వీస్ తో పాటు ప్రధాని మోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్‌పీజీ) కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. గురు-శుక్రవారాల్లో సంయుక్తంగా సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్‌) నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 ఇలా పనిచేస్తుంది:

ఇలా పనిచేస్తుంది:

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఆ దేశ భద్రతావసరాల రీత్యా ప్రత్యేక శాటిలైట్ ను రూపొందించింది. విజయవంతమైన ఈ శాటిలైట్ అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆధీనంలో పని చేస్తుంటుంది. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ శాటిలైట్ ను ప్రస్తుతం హైదరాబాద్ వైపు మళ్లించినట్టు సమాచారం.

ప్రధానంగా ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్, హెచ్‌ఐసీసీ ఉన్న మాదాపూర్, అధికారిక విందు జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో పాటు ఆ చుట్ట పక్కల పది కి.మీ ఈ ఉపగ్రహం ద్వారా ప్రతీ కదలికను గమనించనున్నారు. హై రిజల్యూషన్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం ఈ శాటిలైట్ ప్రత్యేకతగా చెబుతున్నారు. వెస్టిన్ హోటల్లో ఏర్పాటు చేసే కమాండ్ పోస్టు అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ సంయుక్తంగా ఈ ఛాయాచిత్రాలను విశ్లేషించనున్నారు.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

 11వెపన్స్:

11వెపన్స్:

ఇవాంకా భద్రత కోసం అమెరికా నుంచే కాన్వాయ్, భద్రతా సిబ్బంది తరలిరానున్నారు. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అక్కడినుంచే తమ ఆయుధాలను వెంట తెచ్చుకోనున్నారు. ఇప్పటికే 11 రకాలైన ఆయుధాలను తీసుకు రావడానికి అవసరమైన వెపన్స్‌ పర్మిట్‌ను కేంద్రం వారికి జారీ చేసింది. పిస్టల్స్, సబ్-మెషీన్ గన్, స్నైపర్ రైఫిల్స్ లాంటి ఆయుధాలు వీటిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌లో మూడు అంతస్తులు ఎస్‌ఎస్‌ ఏజెంట్ల ఆధీనంలో ఉండనున్నాయి. ఇవాంక బస చేసే అంత స్తుతో పాటు పైన, కింద ఉన్న రెండింటినీ, ఓ లిఫ్ట్, మెట్లదారుల్ని పూర్తిగా ఎస్‌ఎస్‌ ఏజెంట్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

ఐదంచెల భద్రత:

ఐదంచెల భద్రత:

ఇవాంక పర్యటనకు మొత్తం ఐదంచెల భద్రత కొనసాగనుంది. తొలి రెండు అంచెల్లో ఎస్‌ఎస్‌ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ అధికారులు, మూడు, నాలుగు అంచెలు ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాల ఆధీనంలో ఉండనున్నాయి.స్థానిక పోలీసులు ఐదో అంచెలో ఉండె అవకాశముందని తెలుస్తోంది. ఐదంచెల భద్రతలో ఉండే సెక్యూరిటీ మొత్తానికి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ప్రత్యేక ఐడీ కార్డులను కూడా జారీ చేయనున్నారు.

 మొగల్, ముసెగా:

మొగల్, ముసెగా:

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే నేతలు, తమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకునే భద్రతా సిబ్బందికి ప్రత్యేకమైన పేర్లు పెట్టుకున్నారు. అలా ట్రంప్‌ తన సెక్యూరిటీ యూనిట్‌కు మొగల్‌గా పేరు పెట్టారు. ఇవాంకా తన సీక్రెట్‌ సర్వీసెస్‌ బృందానికి మార్వెల్‌గా పేరు పెట్టుకుంది.

మెలానియా ట్రంప్‌ ముసెగా, ఎరిక్‌ ట్రంప్‌ మార్క్స్‌మ్యాన్‌గా పేర్లు పెట్టుకున్నారు. ఇవాంక ట్రంప్‌ సెక్యూరిటీ నిమిత్తం అమెరికా నుంచి హైదరాబాద్‌కు మొత్తం 36 మంది భద్రతాధికారులు వస్తున్నారు. వీరిలో 18 మంది సీక్రెట్‌ సర్వీసెస్‌ భద్రతాధికారులు బయటి ప్రాంతాల్లో విధులు నిర్విర్తిస్తారు. డెలిగేట్ల రూపంలో మరో 18 మంది సదస్సు జరిగే వివిధ ప్రాంతాల్లో విధుల్లో ఉంటారు.

English summary
Ivanka Trump, along with Prime Minister Narendra Modi, will be addressing the inaugural session of Global Entrepreneurship Summit (GES) here on November 28. The three-day event is being co-hosted by the US and India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X