వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మక్కాకు రావద్దు, విమానాలు బంద్: సౌదీ

|
Google Oneindia TeluguNews

రియాద్: షియా మత గురువు నిమ్ర్ అల్ నిమ్ర్ ఉరితీతపై సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ తీరుపై సౌదీ అరేబియా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

ఇరాన్ తో వైమానిక అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నామని, మాదేశం విమానాలు ఇరాన్ కు పంపించమని సౌదీ అరేబియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతే కాకుండ ఇరాన్ తో ఉన్న వాణిజ్య సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

మాతో దౌత్య సంబంధాలు పెంపొందిచుకోవాలంటే మొదట ఇరాన్ ఓ సాధారణ దేశంలా వ్యవహరించడం నేర్చుకోవాలని, తరువాత తాము ఆలోచిస్తామని సౌదీ అరేబియా సూచించింది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న వారినే ఉరి తీశామని, అమాయకులను కాదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.

Saudi Arabia to cut Flight, Trade with Iran

సున్నీ ప్రాబల్య దేశమైన సౌదీ అరేబియాలో షియా మత గురువు నిమ్ర్ అల్ నిమ్ర్ లను ఉరి తీసిన విషయం తెలిసిందే. నిమ్ర్ అల్ నిమ్ర్ ను ఉరితియ్యడంతో ఇరాన్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.

ఇరాన్ తీరును వ్యతిరేకిస్తూ సౌదీ అరేబియాలోని ఆదేశ దౌత్య వేత్తలను తిరిగి మీ దేశానికి వెళ్లి పోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిమ్ర్ అల్ నిమ్ర్ ఉరితీత అనంతరం ఇరాన్ యూనైటెడ్ కింగ్ డమ్ లో భాగమైన సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నిస్తున్నదని సౌదీ ఆరోపిస్తున్నది.

కింగ్ డమ్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లో దాడులు చెయ్యడానికి ఇరాన్ తన ఫైటర్లను పంపిస్తున్నదని విమర్శించారు. ఆయితే అలాంటి దాడులను తాము దీటుగా ఎదుర్కొంటామని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి అదెల్ అల్ జుబీర్ తెలిపారు. ఇరాన్ జాతీయులు మక్కా మదీనాలో అడుగు పెట్టరాదని ఆదేశాలు జారీ చేశారు.

English summary
Saudi Arabia's breach of ties with Iran will extend to cutting air traffic between the countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X