ఇక అక్కడ బికినీలు వేసుకోవచ్చు: సౌదీ యువరాజు సంచలన నిర్ణయం

సౌదీ అంటే అక్కడి చట్టాలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అవి అంత కఠినంగా ఉంటాయి కాబట్టి. మహిళలపై ఆంక్షలు కూడా అలాగే ఉంటాయి. బుర్ఖా లేకుండా బయటికి రాకూడదని, డ్రైవింగ్ చేయకూడదని.

రియాద్: సౌదీ అంటే అక్కడి చట్టాలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అవి అంత కఠినంగా ఉంటాయి కాబట్టి. మహిళలపై ఆంక్షలు కూడా అలాగే ఉంటాయి. బుర్ఖా లేకుండా బయటికి రాకూడదని, డ్రైవింగ్ చేయకూడదని. అంతేగాక, గత కొంత కాలం క్రితమే మహిళలకు ఓటు హక్కు కల్పించడం గమనార్హం.

కాగా, వందల యేళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయానికి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ముగింపు పలకాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సౌదీకి విదేశీ మహిళా టూరిస్టులు ఎవరు వచ్చినా దేశ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాల్సిందే. అలాంటిది ప్రస్తుతం ఉన్న చట్టాలను తోసిరాజని.. ఏకంగా స్త్రీలు బికినీలు ధరించేందుకు అనుమతినిచ్చేలా చట్టాన్ని చేసేందుకు సౌదీ యువరాజు ప్రణాళికలు రచిస్తున్నారు.

Saudi Arabia to open luxury beach resort where women can wear bikinis

సముద్ర తీర ప్రాంతంలో అత్యంత ఖరీదైన రిసార్ట్‌లను ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే స్త్రీలు బికినీలు ధరించేందుకు అనుమతినివ్వాలని యువరాజు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలతో సమానంగా తాము కూడా పర్యాటకులకు ఏమాత్రం ఇబ్బందులు రాకుండా, వారి ఆనందానికి భంగం వాటిల్లకుండా చేస్తే.. చమురేతర ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ యువతి స్కర్టు ధరించిందని అరెస్ట్ చేసిన మర్చిపోకముందే.. యువరాజు ఈ నిర్ణయానికి ఆమోదం తెలపడం గమానర్హం. అంతేగాక, 2022లోపు ఈ బికినీ రిసార్ట్‌లను నిర్మించాలని ఆదేశించారు.

టూరిజాన్ని పెంచేందుకే యువరాజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, యువరాజు తాజా నిర్ణయం సౌదీలో సంచలనంగా మారింది. కాగా, కొందరు సాంప్రదాయవాదులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే, సౌదీ యువరాజు తన నిర్ణయాన్ని ఏ విధంగా అమలు పరుస్తారో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+