పాఠశాలలే లక్ష్యంగా దాడులు: 160 మంది విద్యార్ధులు మృతి
జెనీవా: సిరియాలో గత ఏడాది పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్ధులు మరణించారని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. స్కూలు పిల్లలపై 68 సార్లు దాడులు జరిగాయని, ఈ దాడుల్లో సుమారు 343 మంది చిన్నారులు గాయపడ్డారని యునిసెఫ్ అధికార ప్రతినిధి క్రిస్టోఫే బౌలిరాక్ వెల్లడించారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ప్రశాంతంగా ఉండాల్సిన పాఠశాలలపై దాడి చేసి మారణహోమం సృష్టించడం దారుణమని పేర్కొన్నారు. సిరియాలో 13 నుంచి 16 లక్షల మంది చిన్నారులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సిరియాలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రజా యుద్ధంలో 2 లక్షల మంది వరకు మరణించారని అన్నారు.

దేశంలోని చిన్నారులపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులైన జిహాదీల ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 6,70,000 మంది చిన్నారులపై ఈ ప్రభావం ఉంటుంది ఐక్యరాజ్య సమితి ఆవేదన చెందుతోంది.
తాజా ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రజా యుద్ధం ద్వారా ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభావితం చేయబడగా, 1.7 మిలియన్ పిల్లలు ఇంకా శరణార్ధులుగా నివసిస్తున్నారని తెలియజేస్తున్నాయి.
భారత్‌కు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ వారంలో భారత్ రానున్నారు. భారత్ అభివృద్ధిపై ఆయన చర్చలు జరిపేందుకు రానున్నట్లు బాన్ కీ మూన్ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ వివరాలు తెలిపారు.
జనవరి 10న ఆయన గుజరాత్ వెళతారని, అక్కడ 'వైబ్రాంట్ గుజరాత్' సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో బాన్ కీ మూన్ ప్రపంచ నేతలు, సిద్ధాంతకర్తలు, వాణిజ్య వర్గ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారని డుబారిక్ మీడియాకు తెలిపారు. జనవరి 13న భారత్‌లో ఆయన పర్యటన ముగుస్తుందని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications