ఉద్యోగి నిర్వాకం: సీక్రెట్ కెమెరా బారిన 150 మంది మహిళలు

లక్సెంబర్గ్: మహిళలు ఉపయోగించుకునే గదిలో రహస్యంగా సీసీటీవీ కెమెరాలను పెట్టినందుకు గాను బ్యాంకు ఉద్యోగిని యూరోపియన్ ఇన్వెస్టమెంట్ బ్యాంకు సస్పెండ్ చేసింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఈ బ్యాంకు ప్రెసిడెంట్ వెర్నర్ హోయక్ ఈ విషయంపై మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగిని సస్పెండ్ చేసి దీనిపై విచారణకు ఆదేశించామన్నారు.

బ్యాంకు ఉద్యోగిని పోలీసులకు అప్పగించి విచారణ పూర్తి చేయగా అతడు దోషిగా నిర్దారణ అయింది. దీంతో అతడికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు అ బ్యాంకు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సీక్రెట్ సీసీటీవీ కెమెరా బారిన 150 మంది మహిళ బ్యాంకు ఉద్యోగులు పడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Secret cameras in women's changing rooms at EU bank

ఈ విషయం తెలిసిన బ్యాంకు మానవ వనరుల విభాగం వారు షాక్‌కు గురయ్యారు. విచారణలో భాగంగా ఆ సీసీటీవీ ఫుటేజీని ఎవరూ చూడలేదని, నేరుగా దర్యాప్తు బృందానికి ఇచ్చామని చెప్పారు. లగ్జెంబర్గ్‌లో యూరోపియన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకులో దాదాపు 3000మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఇందులోనే ఉద్యోగం చేస్తున్న ఓ 50 ఏళ్ల వయసు కలిగిన ఆ బ్యాంకు ఉద్యోగి ఎవరికీ తెలియకుండా మహిళలు వస్త్రాలు మార్చుకునే గదిలో టేబుల్ కింద సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. ఈ విషయం బయటకు తెలియడంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+