వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోరైజన్ చిత్రాలు: ప్లూటో ఊహించినంత చిన్నదేంకాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సౌర మండలంలోని మరుగుజ్జు గ్రహం ప్లూటో పరిమాణం పైన సాగుతున్న చర్చకు న్యూ హోరైజన్ వ్యోమనౌక తెర దించింది. ప్లూటో ఊహించిన దానికన్నా చాలా పెద్దదని తేల్చింది. ప్లూటో దిశగా ప్రయాణిస్తున్న వ్యోమనౌక అత్యంత శక్తిమంతమైన టెలీస్కోప్‌తో ప్లూటోను చిత్రీకరించి నాసాకు పంపించింది.

ఈ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు గతంలో అనుకున్నట్లుగా ప్లూటో మరీ అంత చిన్నది కాదని తేల్చారు. ప్లూటో వ్యాసం 2370 కిలోమీటర్లు అని, సౌర వ్యవస్థలో నెఫ్ట్యూన్ కక్ష తర్వాత పరిభ్రమిస్తున్న వాటిలో ఇదే పెద్దదని తెలిపారు. సాంధ్రత విషయంలో తమ అభిప్రాయాలలో స్వల్ప తేడా ఉందన్నారు.

దీంతో ప్లూటోకు ఉన్న 5 చంద్రుళ్లనూ (ఉపగ్రహాలు) హోరైజన్ పరిశీలించిందని చెప్పారు. ముఖ్యంగా నిక్స్, హైడ్రా ఉపగ్రహాలనూ దూరం నుంచే నిశితంగా గమనించే అవకాశాన్ని న్యూ హోరైజన్ కల్పించిందని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్టూయ్ పరిశోధకుడు అలన్ స్టెర్న్ తెలిపారు.

ఇందులో నిక్స్ వ్యాసం 35 కిలోమీటర్లు కాగా, హైడ్రో వ్యాసం రమారమి 45 కిలోమీటర్లు అని తెలిపారు. ప్లూటో సైజు 2370 కిలోమీటర్ల వ్యాసార్థమని తేల్చింది. దీంతో 1930 నుంచి ప్లూటో పరిమాణం పైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనికి తెర పడింది.

 See an Amazing Graphic Comparing Pluto to Earth

అంతరిక్షంలో తొమ్మిదిన్నర ఏళ్లు.. 3 బిలియన్ల మైళ్లు ప్రయాణించిన న్యూ హారిజాన్స్... ఫ్లూటో ఉపరితలంపై మంగళవారం మరో 12,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దాంతో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

న్యూహారిజన్స్ అంతరిక్ష నౌకలో ఉన్న లాంగ్ రేంజ్ రెకన్నైస్సెంస్ ఇమేజర్ (లోర్రి) తీసిన చిత్రాల ద్వారా ఫ్లూటో పరిమాణంపై స్పష్టత వచ్చిందని, గతంలో తెలిసిన సైజు కంటే ఇంకా ఎక్కువగా ఉందనే విషయంపై ఓ నిర్ధారణకు వచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్లూటోపై మంచుతో పేరుకుపోయిన వాతావరణాన్ని ట్రోపోస్పియర్ అంటారని, అలాంటి వాతావరణం కారణంగానే ఫ్లూటో పరిమాణాన్ని కనుగొనడం తమకు సవాల్‌గా మారిందలన్నారు. ఫ్లూటో పరిధిలో ఉన్న మరో రెండు ఉపగ్రహాలు నిక్స్, హైడ్రాలకు సంబంధించిన చిత్రాలను లోర్రి తీసిందన్నారు.

English summary
See an Amazing Graphic Comparing Pluto to Earth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X