29గంటలపాటు బంధించి, రేప్: భార్యపై కోర్టుకు భర్త
సియోల్: తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళలు తమ భర్తలపై అత్యాచారం కేసులు పెట్టిన సందర్భాలు మనం చూసే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. తనను బలవంతంగా అనుభవించిందని భార్యపైనే రేప్ కేసు పెట్టాడు ఓ భర్త. ఈ వింత ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శృంగారం కోసం తన భార్య షిమ్(41) బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ సెంట్రల్ కోర్టును ఆశ్రయించాడు. తనను బలవంతంగా అనుభవించిందని కోర్టుకు తెలిపారు. శుక్రవారం ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్ధోషిగా తేల్చింది.

అయితే, భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్‌ను ఉద్దేశిస్తూ కోర్టు హితవు పలికింది. దీంతోపాటు భార్యతో సఖ్యతగా మెలగాలని కిమ్‌కు సూచించింది.
కాగా, భర్తను 29గంటలపాటు ఇంట్లో బంధించి, అతడిని గాయపరిచినందుకు షిమ్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివాహ అనంతరం భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని(మేరిటల్ రేప్) 2013లో ఆ దేశ సుప్రీంకోర్టు నేరంగా గుర్తించిన తర్వాత.. ఇదే తొలి కేసు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications