వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేపీ శర్మ ఓలికి భారీ షాక్: షేర్ బహదూర్‌ను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండు: నేపాల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నేపాల్‌లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐదు నెలల వ్యవధిలో రెండోసారి రద్దయిన నేపాల్ ప్రతినిదుల సభను సోమవారం ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.

అంతేగాక, రెండు రోజుల్లోగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ చోలేంద్ర షుమ్షర్ రానా నేతృత్వంలోని ధర్మాసనం గత వారం ముగించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనంలో దీపక్ కుమార్ కార్కి, మీరా ఖాడ్కా, ఈశ్వర్ ప్రసాద్ ఖతివాడ, డాక్టర్ ఆనంద మోహన్ భట్టారాయ్ వంటి మరో నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తలు ఉన్నారు. ప్రధాని ఒలి సిఫారసు మేరకు మే 22 న ఐదు నెలల్లో 275 మంది సభ్యుల దిగువ సభను అధ్యక్షుడు బిడియా దేవి భండారి రెండోసారి రద్దు చేసి నవంబర్ 12, నవంబర్ 19 న ఎన్నికలు ప్రకటించారు.

Setback for KP Sharma Oli: Nepal’s SC orders appointment of Sher Bahadur Deuba as PM

కాగా, మధ్యంతర ఎన్నికల కోసం గత వారమే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, దిగువ సభను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ తోపాటు మొత్తం 30 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ చోలేంద్ర షుమ్షర్ రానా నేతృంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జులై జులై 5న వాదనలు వినడం పూర్తి చేసింది.

Recommended Video

New Coronavirus Strain : దక్షిణాఫ్రికా నుండి పుట్టుకొచ్చిన మరో కొత్త కరోనా వైరస్ రకం!

ఈ నేపథ్యంలో సోమవారం తీర్పు వెలువరించింది. దిగువ సభను పునరుద్ధరించడమే కాకుండా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ చీఫ్‌ను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

English summary
Setback for KP Sharma Oli: Nepal’s SC orders appointment of Sher Bahadur Deuba as PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X