మోడీకి ఇమ్రాన్ ఖాన్ షాక్- ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రివర్స్- ఇప్పుడు కుదరదంటూ
భారత్‌లో ఐదు రాష్ట్రాల వేళ పాకిస్తాన్‌తో రాత్రికి రాత్రి దౌత్య సంబంధాలు పెంచుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణతో పాటు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోడీ.. పొరుగున ఉన్న మరో ముస్లిం దేశం బంగ్లాదేశ్‌లోనూ పర్యటించి వచ్చారు. అనంతరం పాకిస్తాన్‌కు చక్కెర, పత్తి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేశారు. దీంతో దిగుమతులకు పాకిస్తాన్ పచ్చజెండా ఊపుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విస్ట్ ఇచ్చారు.
Recommended Video

ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం
బాలాకోట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అనంతరం కశ్మీర్‌లో ఆర్టికల్ 360 రద్దుతో పాకిస్తాన్ భారత్‌కు రైలు, రోడ్డు, వాయు మార్గాలను కూడా మూసేసింది. అయితే ఏడాదిన్నర తర్వాత భారత్ పాకిస్తాన్‌కు స్నేహహస్తం చాచింది. ఎలాంటి సంకేతాలు లేకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ప్రకటించడంతో పాటు మోడీ సర్కారు దాయాది దేశానికి వరుసగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ పొరుగున ఉన్న ముస్లిం దేశాలతో మైత్రికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమేనని అందరికీ అర్ధమైంది.

పాకిస్తాన్‌కు మోడీ వరుస ఆఫర్లు
పాకిస్తాన్‌తో హడావిడిగా కాల్పుల విరమణ ప్రకటించిన ప్రధాని మోడీ... అనంతరం ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతుల విషయంలోనూ వరుసగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా రెండేళ్ల క్రితం నిషేధించిన ప్రత్తి, చక్కెర ఎగుమతుల్ని కూడా తిరిగి ఎగుమతి చేయాలని నిర్ణయించారు. దీంతో ఇంత అర్ధాంతరంగా పాకిస్తాన్‌పై మోడీ ప్రేమ వెనుక కారణాలపై చర్చ సాగుతోంది. అయితే వీటిపై పాకిస్తాన్ మాత్రం తొందరపడడం లేదు.

మోడీ ప్లాన్ పాకిస్తాన్‌కు అర్ధమైందా ?
దేశంలో రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తామన్నట్లుగా హంగామా చేసిన ప్రధాని మోడీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక వేళ తిరిగి స్నేహ హస్తం చాచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశానికి కూడా అర్ధమయ్యాయి. అందుకే భారత్ వరుసగా ఆఫర్లు ఇస్తున్నా పాకిస్తాన్ స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా కాల్పుల విరమణ మినహా మిగతా విషయాల్లో పాకిస్తాన్ అంత ఆసక్తిగా లేదని తెలుస్తోంది. తాజాగా పత్తి, చక్కెర దిగుమతుల విషయంలోనూ భారత్ ఇచ్చిన ఆఫర్‌ను పాకిస్తాన్ తిరస్కరించింది.

ప్రత్తి, చక్కెర దిగుమతులపై యూటర్న్
భారత్ నుంచి రెండేళ్ల క్రితం నిలిచిపోయిన ప్రత్తి, చక్కెర ఎగుమతులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మోడీ సర్కార్ ప్రకటించినా పాకిస్తాన్ మాత్రం దిగుమతులపై నిషేధం సడలించలేదు. తొలుత పాకిస్తాన్‌లోని ఆర్ధిక వ్యవహారాల సమన్వయ కమిటీ భారత్ ఆఫర్‌ను అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నా ఇమ్రాన్ ఖాన్ సర్కారు మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించే పరిస్దితి లేదని తేల్చిచెప్పేశారు. దీంతో మోడీ సర్కారు ఇచ్చిన ఆఫర్‌పై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ యూటర్న్ తీసుకున్నట్లైంది. వాస్తవానికి భారత్ రెండేళ్ల క్రితం నిషేధం విధించినా ఇమ్రాన్ సర్కారు మాత్రం గతేడాది కరోనా సందర్భంగా భారత్ నుంచి కీలక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికీ అది కొనసాగుతున్నట్లే ఉంది.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications