షాకింగ్: మన యువతుల్ని ఐసిస్‌కు అమ్మేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చదువుకున్న అమ్మాయిలను మిడిల్ ఈస్ట్, ఐసిస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసలుగా అమ్ముతున్నారు. ఉద్యోగాల కోసం అందర్నీ వదిలి వెళ్తున్న అమ్మాయిలు తద్వారా మోసపోతున్నారు.
అపరిచితులను నమ్మి ఏడాదికి ఏకంగా వేల సంఖ్యలో మహిళలు మోసపూతూ... చివరకు సెక్స్ బానిసలుగా మారిపోతున్నారు.
భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వేలాది సంఖ్యలో మహిళలను మధ్య ప్రాచ్య దేశాలకు అమ్మెస్తున్నారు. ప్రపంచాన్ని తమ వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులకు సైతం సెక్స్ బానిసలుగా విక్రయిస్తున్నారనేది షాకింగ్.

భారత దేశం నుంచి ఈ తరహా వ్యాపారం న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలలో జరుగుతోంది. ఆయా ప్రాంతాలలోని విమానాశ్రయాల నుంచి అమ్మాయిలను అరబ్ కంట్రీలకు అమ్మేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలోని నేపాలి అమ్మాయిన సౌదీ ఎంబసీ సెక్రటరీ, అతని మిత్రులు సామూహిక అత్యాచారం చేయడంతో ఈ షాకింగ్ అంశం వెలుగు చూసింది.
ఇక్కడి నుంచి అమ్మాయిలను శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర ప్రాంతాలకు పంపించి.. అక్కడి నుంచి ఈజిప్ట్, సిరియాలకు పంపించి ఐసిస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు.












Click it and Unblock the Notifications