వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్సువల్ ఫ్లూయిడిటీ: లైంగిక భావనలు బయటపెట్టడంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారు, ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు

లైంగిక ఆసక్తులు, ధోరణుల గురించి మన ఆలోచించే పద్ధతి మారుతోంది.

ఒకప్పుడు కేవలం ఒకే ఇంద్రధనస్సు లాంటి జెండా ఎగిరేది. కానీ, ఇప్పుడు రకరకాల రంగుల జెండాలు కనిపిస్తున్నాయి. అవి తమ అభిరుచుల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

జనం ఇప్పుడు తమ లైంగిక భావనల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు సంప్రదాయ విరుద్ధంగా, అంతర్లీనంగా ఉన్న లైంగిక గుర్తింపు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ఓపెన్‌గా మాట్లాడుకోవడం వల్ల తమ లైంగిక గుర్తింపును బయటపెట్టడంలో గతంలో ఉన్న బిడియాలు, సంకోచాలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు వారు తమ లైంగిక ఆసక్తులను మరింత స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారు.

కానీ జనాభాలోని కొందరిలో మాత్రం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

చాలా దేశాల్లో మహిళలు ఇంతకు ముందు కంటే ఎక్కువ సంఖ్యలో తమ లైంగిక ఇష్టాయిష్టాల్లో వచ్చిన మార్పులను సులభంగా వ్యక్తం చేయగలుగుతున్నారు. పురుషులతో పోలిస్తే వారు కచ్చితంగా ముందున్నట్లే కనిపిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఈ మార్పుకు కారణం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా సామాజిక వాతావరణంలో వచ్చిన మార్పులు, లింగం ఆధారంగా నిర్ణయించిన పాత్రలు, గుర్తింపు నుంచి మహిళలు బయటకు వచ్చేలా చేశాయని వీరు భావిస్తున్నారు.

అయితే, ఈ కొత్త విషయం బయటపడ్డాక, మరో ప్రశ్న అలాగే ఉండిపోయింది. భవిష్యత్తులో కూడా సెక్స్ ఫ్లూయిడిటీ ఇలాగే ఉంటుందా. అంటే తమ లైంగిక ఇష్టాయిష్టాలను మహిళలు, పురుషులు స్వేచ్ఛగా వ్యక్తం చేయగలరా.

ఇద్దరు మహిళల డాన్స్

స్పష్టమైన మార్పు

లైంగిక ప్రవర్తనల్లో మార్పుల గురించి న్యూయార్క్‌లోని బింఘామ్టన్ హ్యూమన్ సెక్సువాలిటీస్ రీసెర్చ్‌లో షాన్ మాసీ, ఆయన సహచరులు దాదాపు దశాబ్దానికి పైగా అధ్యయనం చేశారు.

ఒక్కో అధ్యయనంలో పాల్గొన్నవారిని తమ లైంగిక ధోరణులు, లింగం గురించి చెప్పాలని వారు అడిగారు.

లైంగిక ఆకర్షణకు సంబంధించిన తాము ఒక విలువైన సమాచారాన్ని గుర్తించామనే విషయం మాసీ, ఆయన సహచరులకు ఇటీవలే తెలిసింది.

"దేవుడా.. మనం ఈ డేటాను 10 ఏళ్లకు సేకరించాం అని మాకు అనిపించింది" అని బింఘామ్టన్‌లో వుమెన్స్, జెండర్, సెక్సువాలిటీ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ మాసీ అన్నారు.

2011-2019 మధ్యలో కాలేజీలకు వెళ్లే యువతులు 'హెటెరోసెక్సువాలిటీ'(భిన్నలింగ లైంగిక సంబంధాలకు) నుంచి వేగంగా దూరం జరుగుతున్నట్లు వారు గుర్తించారు.

77 శాతం మంది యువతులు తాము కేవలం పురుషులకే ఆకర్షితులు అవుతున్నామని 2011లో చెప్పారు. కానీ, 2019లో అలా చెప్పినవారు 65 శాతానికి తగ్గారు. ఇది మార్పును స్పష్టంగా చూపించింది.

అలాగే, పురుషులతో లైంగిక కార్యకాలాపాల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా తగ్గింది.

మరోవైపు, సరిగ్గా అదే సమయంలో పురుషుల్లో లైంగిక ఆకర్షణ, లైంగిక ధోరణి మాత్రం స్థిరంగా అలాగే ఉంది. వారిలో దాదాపు 85 శాతం మంది, తాము మహిళల పట్లే ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. మహిళలతోనే లైంగిక కార్యకలాపాల్లో పొల్గొంటామని 90 శాతం మంది మగాళ్లు చెప్పారు.

బ్రిటన్‌, నెదర్లాండ్స్‌తో పాటూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మిగతా సర్వేల్లో కూడా ఇదే విషయం బయటపడింది. ఈ అన్ని సర్వేల్లో పురుషుల కంటే అమ్మాయిల పట్లే ఎక్కువ ఆకర్షణకు గురవుతున్నట్లు చెబుతున్న మహిళల సంఖ్య పెరిగింది.

ఇద్దరు యువతులు

శక్తి, స్వేచ్ఛ

"ఒకే పాయింట్ మీద దృష్టి కేంద్రీకరించి ఏదైనా చెప్పాలంటే చాలా కష్టం" అని అమెరికా మసాచుసెట్స్ స్ప్రింగ్‌ఫీల్డ్ కాలేజీ, సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎలిజబెత్ మోర్గాన్ అంటున్నారు.

కానీ, మహిళలు పురుషుల్లో లైంగిక పాత్రలు ఎలా మారచ్చు, మారకపోవచ్చు అనేది ఒక ముఖ్యమైన అంశం కావచ్చు అన్నారు.

తాము గుర్తించిన ఈ మార్పు సాంస్కృతిక మార్పుల వల్లే వచ్చిందని మాసీ, ఆయన సహచరులు చెబుతున్నారు.

ఉదాహరణకు స్త్రీవాదం, మహిళా ఉద్యమాలు పుంజుకోవడంతో గత కొన్ని దశాబ్దాలుగా సామాజిక-రాజకీయ పరిస్థితులు మారాయని అన్నారు.

అయితే, ఈ మార్పులు పురుషులను, మహిళలను వేరువేరుగా ప్రభావితం చేశాయి. ఈ మార్పు నిజానికి మహిళల చుట్టూనే తిరిగింది. అది పురుషుల్లో తక్కువ అంటారు మాసీ.

అయితే, ఎల్జీబీటీక్యూ ప్లస్ ఉద్యమం ప్రభావాన్ని వారు చిన్నచూపు చూడడం లేదు. ఆ ఉద్యమం వల్లే ఇప్పుడు చాలామంది తమ లైంగిక ధోరణులు, ఇష్టాయిష్టాల గురించి స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారని అంటున్నారు.

పురుషుల కంటే ఎక్కువగా మహిళలు తమ లైంగిక ఇష్టాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం వెనుక స్త్రీవాదం, మహిళా ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని మాసీ భావిస్తున్నారు.

ముఖ్యంగా పురుషులు తమ సంప్రదాయ లింగ ఆధారిత కట్టుబాట్ల నుంచి బయటపడ్డానికి మహిళల్లా ఉద్యమాలేవీ చేయలేదు.

50 ఏళ్ల క్రితం "ఒక మగాడిని పెళ్లి చేసుకుని, స్థిరపడకపోతే, ఆ జీవితాన్ని ఊహించలేమని, ఎందుకంటే పురుషుడు అవసరం అని అప్పుడు మహిళలకు చెప్పేవారని" మోర్గాన్ అన్నారు.

దానిని బట్టి చూస్తే, మహిళలు హెటెరోసెక్సువాలిటీ(భిన్నలింగ సంపర్కం) నుంచి బయటపడడాన్ని, వారు సంప్రదాయ లైంగిక సంబంధాల నుంచి బయటపడ్డంలాగే చూడవచ్చు అన్నారు.

మరోవైపు, మహిళలు మరింత స్వేచ్ఛ పొందడంలో విజయవంతం అవుతుంటే, పురుషుల పాత్రలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. సమాజంలో అధికారం ఇప్పటికీ వారి చేతుల్లోనే ఉంది.

"ఆ అధికారాన్ని చేజారకుండా చూసుకోవాలంటే వారు తమ 'మగతనం' ఉన్న పురుషుడి పాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. స్వలింగ ఆసక్తిని వ్యక్తం చేయడం వల్ల పురుషుల ఆ అధికారం చేజారిపోవచ్చు" అంటారు మోర్గాన్.

మరోవైపు 'మగతనం' అనేది ఒక సున్నితమైన అంశం అంటారు మాసీ. పురుషులు స్వలింగ ఆకర్షణకు గురైతే దానిని ఉల్లంఘించిట్లు అవుతుంది అన్నారు.

ఇద్దరు మహిళలు సెక్స్ చేయడం లేదా ముద్దాడడాన్ని, ముఖ్యంగా పురుషుల మధ్య వారు అలా చేయడాన్ని ఫెటిషిజేషన్(కాముకత)గా సెక్స్ కోచ్ 24 ఏళ్ల ఎడ్యుకేటర్ వైలెట్ టర్నింగ్ సూచిస్తున్నారు.

తప్పుడు కారణాలతోనే అయినా, అది మహిళల మధ్య స్వలింగ ఆకర్షణను సమాజంలో మరింత ఆమోదయోగ్యంగా మార్చింది. మరోవైపు ఇద్దరు పురుషులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం గురించి జనం ఊహించుకోవడమే చాలా కష్టంగా మారింది.

2019లో జరిగిన ఒక అధ్యయనంలో 23 దేశాల్లోని స్వలింగ సంపర్కులైన పురుషులు, మహిళల లైంగిక ధోరణులను పరిశీలించారు.

అందులో లెస్బియన్ మహిళలతో పోలిస్తే స్వలింగ సంపర్కులైన పురుషులను ఇష్టపడని వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

యువతులు హత్తుకున్న దృశ్యం

బహిరంగ చర్చ

మహిళలు తమ లైంగిక ధోరణులను బహిరంగంగా వ్యక్తం చేయడానికి కాలక్రమేణా వేదికల సంఖ్య కూడా పెరిగింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా సైకాలజీ, జెండర్ స్టడీస్ ప్రొఫెసర్ అయిన లీజా డైమండ్ 1990ల ప్రారంభంలో లైంగిక ఆసక్తుల్లో వచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేశారు.

ఆమె తన పరిశోధనలో పురుషులపై దృష్టి పెట్టారు. అందులో చాలా మంది పాల్గొనేవారు. ఒక గే సపోర్ట్ గ్రూప్ నుంచి ఎక్కువ మంది దానిలో పాల్గొన్నారని ఆమె చెప్పారు.

"ఎక్కువగా పురుషులే పాల్గొంటారు కాబట్టి, పురుషుల లైంగిక ఆసక్తులు గుర్తించడం పరిశోధకులకు చాలా సులభం" అన్నారు.

కానీ, మహిళల లైంగిక ధోరణుల గురించి తెలుసుకోవాలని డైమండ్ అనుకుంటున్నారు.

మరో అధ్యయనంలో ఆమె వంద మంది మహిళల లైంగిక ధోరణులు, వారి లైంగిక ప్రవర్తన గురించి పరిశీలించారు.

ఆమె రాసిన 'సెక్సువల్ ఫ్లూయిడిటీ: అండర్‌స్డాండింగ్ వుమెన్స్ లవ్ అండ్ డిజైర్' అనే పుస్తకం 2008లో ప్రచురితమైంది.

ఇది కొంతమంది మహిళల్లో కాలంతోపాటూ ప్రేమ, ఆకర్షణ ఎలా మారవచ్చు అనేది చెబుతుంది. ఇది అంతకు ముందు ఆలోచనలకు భిన్నంగా ఉంది. గతంలో లైంగిక ఇష్టాయిష్టాలను సులభంగా వ్యక్తం చేయలేమని భావించేవారు. పురుషుల వల్లే అలాంటి అభిప్రాయం ఏర్పడి ఉంటుందని డైమండ్ చెబుతున్నారు.

దాంతో మహిళలను లైంగికంగా నాన్-బైనరీ(ఒక లింగాన్ని స్వీకరించకపోవడం) గా గుర్తించడానికి ఒక భాష ఏర్పడిందని టర్నింగ్ చెప్పారు.

ఉదాహరణకు.. తన లెస్బియన్ పార్టనర్‌కు 2007లో హైస్కూల్లో ఉన్నప్పుడు 'గే స్ట్రెయిట్ అలయన్స్‌' ఉండేదని, ఆ సందర్భం బైనరీని ప్రోత్సహించిందని, బృందంలోని సభ్యులు, స్ట్రెయిట్ లేదా గేలతో లైంగిక సంబంధాలు పెట్టుకునేలా చేసిందని ఆమె చెప్పారు. ఆ మధ్యలో ఎక్కడో వారికి లైంగిక గుర్తింపు వచ్చినా, వారికి నిజానికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండేది కాదని చెప్పారు. ప్రత్యేకంగా మహిళల మధ్య సంబంధాలకు అక్కడ ఎలాంటి పదం లేదని అన్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్కరినీ క్వీర్(స్వలింగ సంపర్కులు) అనేయవచ్చు. ఈ మాటకు విస్తృత గుర్తింపు ఉంది అని టర్నింగ్ అన్నారు.

దంపతులు

భవిష్యత్తులో ఏం జరుగుతుంది

ఇప్పుడు ఈ ధోరణి పురుషుల్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

టిక్‌టాక్ కోసం వీడియోలు చేస్తూ తమను తాము స్వలింగ సంపర్కులుగా చెప్పుకుంటున్న పురుషులు ఎంతోమంది ఉన్నారు.

మహిళా ఫాలోయర్స్‌లో ఎక్కువమంది వారి ఆ గుర్తింపునే ఇష్టపడుతున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్‌లో చెప్పింది.

వారు అలా వీడియో చేస్తున్నప్పుడు అది వారికి సౌకర్యంగా ఉందా, లేదంటే క్లిక్‌ల కోసం వారు అలా చేస్తున్నారా అనేది వేరే విషయం. కానీ, ఈ ట్రెండ్ ద్వారా పురుషుల్లో మగతనంపై ఉన్న ఆలోచన మారుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ముందు ముందు, ఈ మారుతున్న ధోరణిలో ఇంకా ఎక్కువ మంది పురుషులు చేరవచ్చు.

ఈ విషయంలో మరింత సరళమైన వైఖరితో ఉండే మహిళలు కూడా దారి చూపించడానికి సాయం చేయవచ్చు. చాలా మంది మహిళలు తమ లైంగిక ఆసక్తుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ఎక్కువ మంది తమ చుట్టూ గీసిన గీతలను చెరిపేసి ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుతున్నారని అర్థం.

మన సంస్కృతి లైంగిక భావనల గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడేలా చేసింది. దానిని సరళతరం చేయాలంటే, సమాజంలో అది మరింత ఆమోదయోగ్యం కావాలంటే జనం సిగ్గుపడకుండా బయటికొచ్చి స్వేచ్ఛగా దాని గురించి మాట్లాడగలగాలి.

అలా జరిగినప్పుడే జనం ఎక్కువగా బయటకు వచ్చి అందరిలో తమ లైంగిక ఇష్టాయిష్టాల గురించి చెప్పగలరు అంటారు డైమండ్.

"మనం పురుషులకు భిన్నలింగ సంపర్కం, సంప్రదాయంగా వస్తున్న పురుషత్వం నుంచి నుంచి విముక్తి కల్పించడం ప్రారంభించాలి. అప్పుడే మనం భిన్నమైన ఫలితాలను సాధిస్తాం. లేదా మహిళలు సాధించిన అలాంటి సమాన ఫలితాలను పొందవచ్చు" అంటారు మాసీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Sexual Fluidity: Women are ahead of men in expressing sexual feelings, why?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X