వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలులో ఒంటరి మహిళను వీడియో తీస్తూ వెధవ్వేశాలు(వీడియో)

లోకల్ రైళ్లో ఒంటరిగా ఉన్న మహిళ వీడియో తీస్తూ దొరికిపోయాడు ఓ పెద్ద మనిషి. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించిన అతగాడి బాగోతాన్ని ఆ మహిళ కూడా అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస

|
Google Oneindia TeluguNews

సింగపూర్: లోకల్ రైళ్లో ఒంటరిగా ఉన్న మహిళ వీడియో తీస్తూ దొరికిపోయాడు ఓ పెద్ద మనిషి. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించిన అతగాడి బాగోతాన్ని ఆ మహిళ కూడా అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియోను లక్షల మంది వీక్షిస్తున్నారు. కాగా, చివరకు సోదరితో సమానమంటూ కాళ్ల బేరానికి వచ్చేలా చేసిందా మహిళ.

వివరాల్లోకి వెళితే.. మెట్రో రైలు మొత్తం ఖాళీగా ఉన్న అతడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న ఐఫోన్ బయటకు తీసి, దాంట్లో ఏదో చూస్తున్నట్లు స్క్రీన్ వైపు చూస్తూ చాలా సేపు అలాగే ఉన్నాడు. అతడు ఫోన్ పట్టుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో కాస్త జాగ్రత్తగా పరిశీలించిందా మహిళ.

కాగా, అతని వెనుకాల ఉన్న కిటికీ అద్దాల్లో అతడు ఏం చేస్తున్నాడో కనిపించింది ఆమెకి. తననే వీడియో తీస్తున్నాడని గుర్తించిన సదరు మహిళ.. అతనికి తెలియకుండా అతడు చేస్తున్న పనిని వీడియో తీసింది. అతడు తొలుత మామూలుగా చూస్తూనే.. కాసేపు ఆగి ఫోన్‌లో వీడియోను మరింత జూమ్ చేసిన ఆమెను క్లోజప్‌గా షూట్ చేయడం మొదలుపెట్టాడు. అదంతా అతడి వెనుకాల ఉన్న అద్దంలో కనిపిస్తూనే ఉంది.

ఇదంతా వీడియో తీసిన సదరు మహిళ.. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఆ వీడియోను కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 50లక్షల మందికిపైగా వీక్షించడం గమనార్హం. గత శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా, ఆదివారం ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

అంతేగాక, వీడియో తీసిన ఆ వ్యక్తితో అప్పుడే గొడవకు దిగిన సదరు మహిళ.. నీవు చేస్తున్న పనేంటి? అని అతడ్ని నిలదీసింది. తర్వాతి స్టేషన్ వచ్చిన తర్వాత అతడ్ని పోలీసులకు కూడా పట్టించింది. అతడు చేసిన నిర్వాకాన్ని పోలీసులకు తాను తీసిన వీడియోలు చూపించింది. దీంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె తన చెల్లెలిలాంటిది అంటూ ఆమె కాళ్ల బేరానికి వచ్చాడు ఆ పెద్ద మనిషి వెధవ.

ఇలాంటి వారిని క్షమించకూడదని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదనే తాను ఇలా అందరి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపింది. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. ఆ వెధవకు గట్టిగా బుద్ధి చెప్పిన ఆ మహిళ భారతసంతతికి చెందిన ఉమామహేశ్వరి కావడం గమనార్హం.

English summary
While we talk about crime against women in India, do we think about our fellow citizens who reside in other parts of the globe? If not, then we should start doing so, because crime against women seems to be a never-ending topic across the globe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X