Shocking Video: అమెరికా వదిలివెళ్లిన ఛాపర్ లో తాలిబన్ల విహారం-వేలాడుతున్న శవంతో
ఆప్ఘనిస్తాన్ లో అమెరికా బలగాలు వెళ్లిపోయాక పరిస్ధితులు దారుణంగా మారబోతున్నాయని అంతా ఊహించినట్లే జరుగుతోంది. అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టును వీడి 24 గంటలు కూడా గడవకముందే దేశంలో దారుణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాబుల్ ఎయిర్ పోర్టులో అమెరికా విడిచివెళ్లిన యూఎస్ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ ను తాలిబన్లు అప్పుడే వాడటం మొదలుపెట్టేశారు.
ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా వదిలివెళ్లిన యూఎస్ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ వాడేందుకు పనికిరాదని తొలుత ప్రకటించిన తాలిబన్లు... కొద్ది గంటల్లోనే దాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. కాందహార్ మీదుగా దాన్ని చక్కర్లు కొట్టించారు. అందులో తాలిబన్లు విహరిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ వీడియోలో కనిపించిన మరో దృశ్యం అక్కడి దారుణ పరిస్దితులకు అద్దం పట్టేలా ఉంది.

తాలిబన్లు ప్రయాణిస్తున్న అమెరికన్ హ్లాక్ హాక్ హెలికాఫ్టర్ కు కింద ఓ తాడు వేలాడుతోంది. దానికి కింద ఓ శవం వేలాడుతోంది. అంటే తమకు గిట్టని వ్యక్తిని హతమార్చి ఆ హెలికాఫ్టర్ కు వేలాడదీసి మరీ తాలిబన్లు ఊరేగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా పలువురిని షాక్ కు గురి చేస్తోంది. పలువురు అంతర్జాతీయ జర్నలిస్టులు దీన్ని ట్విట్టర్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై షేర్ చేస్తున్నారు.
తాలిబన్లు తమకు పూర్తిగా పట్టున్న కాందహార్ ప్రావిన్స్ పై నుంచి ఈ హెలికాఫ్టర్ ను చక్కర్లు కొట్టించారు. ఈ ఛాపర్ కింద వేలాడుతున్న వ్యక్తి చనిపోయాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే వారు చంపిన వ్యక్తి శవాన్నే వారు వేలాడదీసినట్లు స్ధానికంగా వార్తలు వెలువడుతున్నాయి. దీన్ని కింద నుంచి వీడియో తీయడంతో అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఈ దృశ్యాల్ని కాందహార్ ప్రావిన్స్ నుంచి చూసిన వారు భయభ్రాంతులకు గురి కాగా.. వీడియోలో చూసిన వారు కూడా షాక్ కు గురవుతున్నారు. మరికొద్ది రోజుల్లో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లు శత్రుశేషం లేకుండా చూసుకుంటున్నట్లు ఈ వీడియోను బట్టి చూస్తే అర్ధమవుతోంది.
ఈ వీడియోను చూసిన మరికొందరైతే ఈ హెలికాఫ్టర్ ను ఏదైనా భవంతి పై ల్యాండ్ చేసేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు ఉందని చెప్తున్నారు. అయితే కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి ఎగిరిన ఈ హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయి ఉంటుంది, దీన్ని ఎవరు ఆపరేట్ చేశారన్న దానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
If this is what it looks like… the Taliban hanging somebody from an American Blackhawk… I could vomit. Joe Biden is responsible.
— Liz Wheeler (@Liz_Wheeler) August 30, 2021
pic.twitter.com/muHLEi3UvK












Click it and Unblock the Notifications