మాజీ ప్రధానిపై షూ విసిరిన యువకుడు: ఉద్రిక్తత
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. జమియా నమీనియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్ షరీఫ్.. వేదిక మీదకు ప్రసంగించేందుకు వెళ్తుండగా ఓ యువకుడు అకస్మాత్తుగా షూ విసిరి పెద్దఎత్తున నినాదాలు చేశాడు.

ఈ క్రమంలో షూ నేరుగా షరీఫ్ భుజాలకు, చెవులకు తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి భద్రతాధికారులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
అనంతరం నవాజ్ షరీప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే తన ప్రసంగంలో ఎక్కడా కూడా తనపై దాడికి పాల్పడిన యువకుడి గురించి ప్రస్తావించలేదు షరీఫ్. అంతకుముందు శనివారం కూడా పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖవాజా ఆసిఫ్‌పై కూడా ఇలాంటి దాడే జరిగింది. అతని ముఖంపై ఓ వ్యక్తి నల్లసిరా పోసి నిరసన తెలిపాడు.












Click it and Unblock the Notifications